VIRAL VIDEO: సాధారణంగా సినిమాల్లో దేవి(Devisri Prasad) పాటలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా లవ్ స్టోరీస్ కి దేవి పెట్టింది పేరు. ఆర్య, ఆర్య2(Arya 2), ఉప్పెన(Uppena) వంటి సినిమాల్లో దేవి పాటలు ఆల్ టైం చాట్ బస్టర్స్ గా రికార్డు సృష్టించాయి. అలాంటిది 'తండేల్'(Thandel) సినిమాకు ముందుగా దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా వద్దని చెప్పారట నిర్మాత అల్లు అరవింద్. అయితే ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు అల్లు అరవింద్(Allu Aravind). తాను దేవిని వద్దని చెప్పడానికి గల కారణాన్ని బయటపెట్టారు.
Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!
దేవి శ్రీ ప్రసాద్ ని #Thandel కి వద్దు అనుకున్నా..
— Movies4u Official (@Movies4u_Officl) February 1, 2025
కానీ లవ్ స్టోరీ కి దేవి నే కరెక్ట్ అని #AlluArjun చెప్పాడు...
- అల్లు అరవింద్ pic.twitter.com/SHldfhu3tO
నా సినిమాకు దేవి మ్యూజిక్ చేయొద్దు
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. "ముందుగా టీమ్ దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుందామని సజెస్ట్ చేశారు. కానీ నేను వద్దని అన్నాను. ఎందుకంటే అదే సమయంలో పుష్ప2 కి కూడా వర్క్ చేస్తున్నారు. దీంతో దేవి మా సినిమా కోసం టైమ్ స్పేర్ చేయగలరా అనే సందేహం వచ్చింది. దేవి అంటే నాకు చాలా ఇష్టం.. మాకు చాలా సినిమాలు కూడా చేశాడు. కానీ ఈ సినిమాకు తీసుకోవడం కరెక్టేనా అని సందేహంలో ఉండిపోయాను. అలా ఒక రోజు ఈ విషయం గురించి బన్నీతో డిస్కస్ చేయగా.. లవ్ స్టోరీ అంటే దేవినే.. ఇక ఏ మాత్రం ఆలోచించకు అని చెప్పాడు. దాంతో ఇక దేవినే అని ఫిక్స్ అయిపోయినట్లు" అని తెలిపారు అల్లు అరవింద్.
చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన మూవీ తండేల్. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి..అక్కడ పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!