Rapido: ర్యాపిడో నుంచి ఫుడ్‌ డెలివరీ యాప్‌..

ర్యాపిడో తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్‌లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్‌లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది.

New Update
Rapido officially launches food delivery app ‘Ownly’ in Bengaluru

Rapido officially launches food delivery app ‘Ownly’ in Bengaluru

ప్రస్తుత రోజుల్లో చాలామంది తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ర్యాపిడో సేవలను వినియోగిస్తున్నారు. బైక్, కార్ల రైడింగ్‌ సేవలతో ర్యాపిడో అగ్రగ్రామిగా కొనసాగుతోంది. అయితే ఈ సంస్థ తాజాగా ఫుడ్‌ డెలివరీ(food-delivery) సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్‌లీ' అనే పేరుతో ఓ యాప్‌(Ownly App) ను లాంచ్ చేసింది. రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్‌ను కూడా ఓన్‌లీ వసూలు చేయదని ర్యాపిడో వెల్లడించింది. కానీ రవాణా ఖర్చుల కోసం మాత్రం కస్టమర్ల నుంచి డెలివరీ ఫీజు వసూలు చేస్తామని తెలిపింది.    

Also Read: ఇండియాకు రష్యా బంపరాఫర్.. కష్ట సమయంలో నేనున్నాని పుతిన్ భరోసా

Rapido Officially Launches Food Delivery App ‘Ownly'

ఓన్‌లీ యాప్‌లో ప్లాట్‌ఫామ్ ఫీజుల, మెను ధరలను పెంచడం ఉండదని కంపెనీ చెబుతోంది. కస్టమర్లు కేవలం ఫుడ్‌, డెలివరీకి అయ్యే డబ్బులు మాత్రమే చెల్లిస్తే చాలని తెలిపింది. ముందుగా ఈ సేవలను బెంగళూరు(bengaluru) లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో మిగతా నగరాల్లో కూడా ఓన్‌లీ సేవలు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. - LATEST BUSINESS NEWS

Also Read: అమెరికా, ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ .. ఇరాన్ అట్రిషన్ వార్

Advertisment
తాజా కథనాలు