/rtv/media/media_files/2025/02/19/HixqmYg4Pj2fSSQ0gNOa.jpg)
Google Pixel 8a Smartphone available Rs.15,000 discount
Flipkart Mobile Offers: గూగుల్(Google) త్వరలో తన కొత్త A-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 9aని విడుదల చేయబోతోంది. ఈ క్రమంలో దీనికంటే ముందు గత సంవత్సరం ప్రారంభించబడిన Google Pixel 8aపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇప్పుడు Flipkartలో రూ.35,000 కంటే తక్కువ ధరకు దీనిని కొనుక్కోవచ్చు. పలు బ్యాంక్ ఆఫర్లు(Bank Offers), డిస్కౌంట్(Discounts)లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!
Google Pixel 8a discount
కంపెనీ Google Pixel 8a స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం 8GB RAM - 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 52,999 ధరతో విడుదల చేసింది. అయితే ఇప్పుడు దీనిపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ తగ్గింపుతో దీనిని కేవలం రూ.37,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల(Exchange offers) ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్(HDFC Bank Credit Card) ద్వారా EMI లావాదేవీపై రూ. 3000 తగ్గింపు పొందుతారు. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్(Flipkart Axis Bank Card)పై 5% వరకు క్యాష్‌బ్యాక్ అందించబడుతుంది. ఇది కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. కొన్ని పాత మోడళ్లపై అదనంగా రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
Google Pixel 8a Specifications
Pixel 8a స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో కంపెనీ Google Tensor G3 ప్రాసెసర్‌ని అందించారు. ఇది 8GB RAMతో వస్తుంది. Google Pixel 8a స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 64MP ప్రధాన కెమెరా, 13MP సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. అలాగే 13MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో అందించబడ్డాయి. Google Pixel స్మార్ట్‌ఫోన్ 4492mAh బ్యాటరీని కలిగి ఉంది.