/rtv/media/media_files/2025/03/03/wzhljDbRaEzBG2WaeccF.jpg)
blue ghost Photograph: (blue ghost)
చందమామకు దారులు పడుతున్నాయి. సంవత్సరం కాలంలోనే రెండు ప్రైవేట్ ల్యాండర్ దిగాయి. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. బ్లూ ఘోస్ట్ అనే లూనార్ ల్యాండర్‌ను ఆదివారం జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా దించింది. చంద్రుడిపై కూలిపోకుండా, పడిపోకుండా సరిగ్గా ల్యాండర్ ను దించిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ నిలిచింది. ఇంట్యూటివ్ మెషీన్స్ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ప్రయోగించిన మరో ల్యాండర్ ఎథెనా గురువారం చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. అయితే, అది చంద్రుడి దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల పరిధిలో ల్యాండ్ కానుంది. ఆ సంస్థ గత ఏడాది ఫిబ్రవరి 22న ఒడిసస్ ల్యాండర్‌ను చందమామపై దించి, ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థగా చరిత్ర సృష్టించింది. కానీ, ల్యాండింగ్ టైంలో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా కిందపడిపోయింది.
Also Read: 4వేల ఎకరాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - 80కి పైగా భవనాలు దగ్ధం..!
“Contact light, engine stop!”
— Dr. Buzz Aldrin (@TheRealBuzz) March 2, 2025
Congratulations FireFly Aerospace for Blue Ghost’s Mission 1 successful Moon landing today!
It also marks a new milestone in the collaborations between NASA and private Space companies, as part of NASA's Commercial Lunar Payload Services (CLPS)… pic.twitter.com/Y5psA3qSu9
ఈ బ్లూ ఘోస్ట్ ల్యాండర్ నాసాకు చెందిన 10 శాస్త్ర, సాంకేతిక పరికరాలతో ఆదివారం చందమామపై అడుగుపెట్టింది. దాదాపు 6.6 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పున ఉండే ఈ ల్యాండర్‌ను జనవరి 15న ఫ్లోరిడాలోని కేప్‌కెనవరాల్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. చందమామపై నిర్ణీత ల్యాండింగ్ సైట్‌కు 328 అడుగుల పరిధిలోనే ఇది ల్యాండ్ అయినట్టు ఫైర్‌ఫ్లై సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
Also Read: రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. సీఎం కీలక ప్రకటన
చంద్రుడిపై దిగిన అరగంటలోనే బ్లూ ఘోస్ట్ అక్కడి చిత్రాలు తీసి భూమికి పంపడం ప్రారంభించింది. బ్లూఘోస్ట్ ద్వారా చంద్రుడిపైకి 10 పరికరాలను పంపడానికి నాసా 101 మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.883.45 కోట్లు, వాటి తయారీకి 44 మిలియన్ డాలర్లు (రూ.385 కోట్లు) ఖర్చు చేశారు. ఆ పరికరాలతో చంద్రుడిపై బ్లూ ఘోస్ట్ చంద్రుడిపై 15 రోజులుపాటు రీసెర్చ్ చేయనుంది. చంద్రుడిపై మానవ మనుగడకు, అంతరిక్ష యాత్రకు ప్రైవేట్ సంస్థలు పోటీ పడుతున్నాయి.