/rtv/media/media_files/2025/01/17/x9a3UsbYPkXxoYZG7Zl7.webp)
Gun
తాగుడుకు, జూదానికి బానిసయ్యాడు. అక్కడితో ఆగకుండా తండ్రి తో అన్నదమ్ములతో చిటికిమాటికీ గొడవలు పెట్టుకున్నాడు. ఆస్తిలో వాటా కూడా ముందుగానే తీసేసుకున్నాడు.సొంత వ్యాపారం పెట్టాడు.నష్టాలు రావడంతో తండ్రి ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగాడు.దీంతో తండ్రికి తుపాకీతో బీభత్సం సృష్టించాడు.
Also Read:IMD -Ap: మరో నాలుగు రోజులు వడగళ్ల వానలు..జాగ్రత్త..వాతావరణ శాఖ హెచ్చరికలు!
ఈ ఘటన నెల్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన రాజ్‌మల్ జైన్ కు ముగ్గురు కొడుకులు..ఓ కూతురు ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు దిలీప్ కుమార్ జైన్ ,మూడో కుమారుడు మనోజ్ కుమార్ జైన్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.
Also Read: PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన!
రెండో కుమారుడు హితేష్ కుమార్ జైన్ అలియాస్ జతిన్ జైన్ వ్యసనాలకు బానిసై పెళ్లి తరువాత వేరే వీధిలో వేరుగా ఉంటున్నాడు.తండ్రి నుంచి ఇప్పటికే రూ.40 లక్షలు తన వాటాగా ముందుగానే తీసుకున్నాడు.
ఆ డబ్బుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు.ఐదు సంవత్సరాల నుంచి సుబేదారు పేటలో దుర్గ గ్లాస్,ప్లైవుడ్ దుకాణం నిర్వహిస్తుండగా నష్టాలు చవి చూశాయి. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కావాలని తల్లిదండ్రులు,అన్నదమ్ములను వేధింపులకు గురి చేస్తన్నాడు. అప్పుడప్పుడు వచ్చి తండ్రితో గొడవకు దిగుతున్నాడు.ఈ నెల 11న మరోసారి తండ్రి వద్దకు వచ్చి ఆస్తి పంపకాలు చేస్తారా? లేకతుపాకీతో కాల్చుకుని చనిపోతానని బెదిరించాడు.
కానీ ఆ సమయంలో తుపాకీ పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంతలో ఇతర పెద్దలు జోక్యం చేసుకోవడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. కానీ ఈ క్రమంలోనే రాత్రి మరో ఐదుగురితో ఇంటికి వచ్చి తలుపులు తీయాలంటూ గొడవ చేశాడు. కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. ఎవరూ రాకపోవడంతో లైసెన్సు ఉన్న పిస్తోల్ తో ఒక రౌండు ఇంటి తలుపులపై కాల్చాడు.
ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. భయాందళనలో ఉన్న బాధితులు ఎస్పీ కృష్ణకాంత్ కు ఫిర్యాదు చేశారు. చిన్నబజారు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Hotels & Restaurant: భోజన ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై అర్థరాత్రి వరకు ఆ హోటల్స్ ఓపెన్!
nellore | crime | attack | gun | shooting | son | father | latest-news | latest-telugu-news | latest telugu news updates