/rtv/media/media_files/2024/12/26/QrTTLI5Ih0G0fhbkgn3L.jpg)
Modi government good news to AP
NDA కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీపై మోదీ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. ఓ వైపు పోలవరం.. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తుంది. ఇంకొవైపు రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం దిశగా అడుగులెస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం ప్రభుత్వం.
Also Read : ఇట్స్ కన్ఫర్మ్.. పూరి సినిమాలో హీరోయిన్ గా టబు
5 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్..
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర విభజన వేళ నుంచి పరిష్కారం కాని సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అమరావతి నుంచి హైదరాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం డీపీఆర్ సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించింది. మొత్తం 6 లైన్లలో దాదాపు 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడు
అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే వస్తే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ హైవేను అమరావతి నుంచి హైదరాబాద్‌కు ఏ రూట్‌లో ప్లాన్ చేశారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అమరావతి నుంచి హైదరాబాద్‌కు రెండు రూట్‌లు ఉన్నాయి. విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు ఒక రూట్.. పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్‌కు మరో రూట్ ఉంది. ఇందులో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ఏ రూట్ నుంచి వస్తుందనేది స్పష్టం కాలేదు.
ఇది కూడా చదవండి: పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే
మరోవైపు ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం భూ సేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందుకోసం కేంద్రం నిధులనూ మంజూరు చేసింది. ఇదే సమయంలో - ఏపీలో మరో రిఫైనరీని ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది కేంద్రం. అలాగే అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్‌లు రూపొందించాలని సూచించింది.
Also Read : మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి
today telugu news | chandrababu | modi-government | andhra-pradesh-news | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu