Tomato: భారీగా పతనమైన టమోటా ధర... కిలో ఒక్క రూపాయికే
టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు.
టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు.
లోన్ యాప్స్ వేధింపులు భరించలేక గుంటూరుకు చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీశైలం శిఖరేశ్వరం అడవుల్లో 10 అడుగుల లోతులో దూకింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా యువతి ఆచూకీ లభ్యమైంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘోర అవమానం. ఎమ్మిగనూరులో రోడ్డుపై YSR విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తి చెప్పుల దండ కట్టి వెళ్లాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని YSRCP నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలులోని చెల్లెల చెలిమలలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వెంటనే బాలిక కేకలు వేయడంతో యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. బాధితరాలి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిపై నిప్పు అంటించారు.
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్‌లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
పెళ్లి ఊరేగింపులో డీజే వాహనం అదుపు తప్పి నవ వధూవరుల వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు అక్కడిక్కడే మృతి చెందడంతో కుటుంబం శోక సంద్రంలోకి మునిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే డీజే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నూతన రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి కానుకగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
కర్నూల్ జిల్లాలో కన్న కొడుకులు తండ్రిపై దారుణానికి పాల్పడ్డారు. 35 ఏళ్లు వయసు వచ్చినా పెళ్లి చేయడం లేదని తండ్రిపై బలమైన కర్రలతో దాడి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రగాయాలపాలైన తండ్రి రాజును ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చెందిన లావణ్య తన చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్ క్రియేట్ చేసింది. ఓ యువకుడిని ముగ్గులోకి దించింది. రూ.1.20 కోట్లు వసూలు చేసింది. ఇదంతా గ్రహించిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.