Tomato: భారీగా పతనమైన టమోటా ధర... కిలో ఒక్క రూపాయికే

టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు. 

New Update
11

కర్నూలు జిల్లాలో రైతులకు టమోటా చుక్కలు చూపిస్తోంది. బయట మార్కెట్‌లో కిలో 20, 30 రూ.  పలుకుతున్న టమోటా ధర పత్తికొండ మార్కుఎట్‌లో మాత్రం కిలో ఒక్క రూపాయికి పడిపోయింది. దీంతో, పెట్టుబడు, కిరాయిలు.. ఇలా ఏవీ దక్కకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా టమోటా ధర ఒక్కసారిగా హైదరాబాద్ మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. అందుకే టమోటా ధర తగ్గిందంటున్నారు వ్యాపారులు. నిన్నటి దాకా బయటి మార్కెట్ లో కిలో టమోటా రూ.30 వరకు పలికింది..కానీ ఉన్నట్టుండి రూపాయికి పతనం కావడంతో.. ఎంతో కష్టపడి టమోటా పండించి.. మార్కెట్‌కి చేర్చితే.. కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదని టమోటాను మార్కెట్‌కి తరలించే రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు కన్నీరు పెడుతున్నారు. 

Also read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్‌ 19 మహమ్మారి..39 మంది మృతి

Also Read: జీవో 46పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

Tomato Price In AP

కొన్ని రోజుల క్రితం జత బాక్స్ 1500 నుచి 2000 పలికిన టమోటా ధర ప్రస్తుతం 50 నుంచి 100 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటాలు తెంఇన కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా కూడా రావడం లేదని అంటున్నారు. మరో వారం రోజుల్లో మోటా ర లేకపోతే మార్కెట్ మూతపడాల్సిందేనని వ్యాపారులు చెబుతున్నారు. 

 Also Read: కేటీఆర్‌కు మాతో పోల్చుకునే అర్హత లేదు.. భట్టి సంచలన కామెంట్స్!

Also Read: సిరియాలో అసద్ పాలన అంతం వెనుక 14 ఏళ్ల బాలుడి హస్తం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nandyala Incident మరో పదిరోజుల్లో పెళ్లి.. ఇంతలోనే... గుండెపగిలేలా ఏడుస్తున్న కన్నతల్లి

నంద్యాల జిల్లా ఆత్మకూరలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో పెళ్లనగా వరుడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తుండగా .. అతడి బైక్ ని బొలెరో వాహనం ఢీకొట్టింది.

New Update
Nandyala incident groom spot dead in accident

Nandyala incident groom spot dead in accident

మరో పదిరోజుల్లో పెళ్లనగా.. పెళ్ళికొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పారాణితో చూడాల్సిన కొడుకును ప్రాణం లేకుండా చూసిన ఆ కన్నతల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. పెళ్లి భాజాలతో కళకళలాడుతూ ఉండాల్సిన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ విషాదకరమైన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణం ఏకలవ్య నగర్ లో చోటుచేసుకుంది. 

Also Read :  Saudi Arabia: వెంటనే ఆపేయండి.. ఇజ్రాయెల్‌కు వార్నింగ్‌ ఇచ్చిన సౌదీ

Also Read :  పోలీసులకు చిక్కిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తెలంగాణకు పయణం!

పెళ్లి పత్రికలూ ఇవ్వడానికి వెళ్ళి.. 

అయితే ఆత్మకూరు కి చెందిన నాగేంద్ర అనే యువకుడు ఈ నెల 30న తన పెళ్లి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇస్తూ వస్తున్నాడు. అలా వరుడు నాగేంద్ర లింగాల గ్రామంలోని తన బంధువులకు పత్రిక ఇచ్చేందుకు వెళ్ళాడు. పత్రిక ఇచ్చిన తర్వాత తిరిగి ఆత్మకూర్ కి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగేంద్ర వెళ్తున్న బైక్ ని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు నాగేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకొని.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన కొడుకు..  ఇక లేడని తెలియడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. అతడి కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Also Read :  అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

Also Read :  ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

 

nandyala-district-atmakuru | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | andhra-pradesh-news | andhra-pradesh-crime-reports | telugu crime news

Advertisment
Advertisment
Advertisment