రోజాకు బిగ్ షాక్.. అట్రాసిటి కేసులో అరెస్ట్!? మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్‌లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. By srinivas 30 Nov 2024 | నవీకరించబడింది పై 30 Nov 2024 17:34 IST in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి AP: మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్‌లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. దళితులను అవమానించారంటూ.. ఈ మేరకు 2023 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను పర్యాటక శాఖ మంత్రి హోదాలో రోజా సందర్శించారు. పర్యాటక శాఖ రిసార్ట్స్ వద్ద మంత్రికి అధికారులు స్వాగతం పలికి బీచ్ వద్దకు తీసుకెళ్లారు. ఆమె సముద్రంలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు విడిచి వాటిని జాగ్రత్తగా చూడాలంటూ సిబ్బందిని ఆదేశించారు. దీంతో స్థానిక పర్యాటక శాఖకు చెందిన రిసార్ట్స్ ఉద్యోగి శివనాగరాజు రోజా చెప్పులను కొద్దిసేపు మోసి పక్కన పెట్టారు. ఆ తర్వాత బీచ్ నుంచి తిరిగొచ్చిన రోజా ఆ చెప్పులు వేసుకుని రిసార్ట్స్‌కు వెళ్లారు. ఇది కూడా చదవండి: టీమిండియా క్రికెటర్ పై కన్నేసిన'బాలయ్య' హీరోయిన్..డేటింగ్ కి రెడీ అంటూ అయితే అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నాగరాజు దళితుడు కావడంతో తమను అవమానించారంటూ ఆమెపై దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: వామ్మో ఆఫీసులో కునుకు తీశాడని.. ఇన్ని లక్షలు ఫైన్ హా? #RK ROJA #case-filed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి