చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలానికి చెందిన లావణ్య తన చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్ క్రియేట్ చేసింది. ఓ యువకుడిని ముగ్గులోకి దించింది. రూ.1.20 కోట్లు వసూలు చేసింది. ఇదంతా గ్రహించిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. By Seetha Ram 21 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సోషల్ మీడియా ద్వారా ఎలాగైనా ఇతరులను మోసగించి డబ్బులు కొట్టేదామని చూస్తున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నా జేబుకి చిల్లు పడటం ఖాయం అని కొందరు అంటున్నారు. ఇప్పటికి చాలానే ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు జరిగాయి. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. తన చెల్లి ఫోన్‌లో ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన ఓ యువతి.. ప్రేమ పేరుతో ఓ యువకుడిని ముగ్గులోకి దించింది. Also Read: 10,12 పరీక్షల తేదీని ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు అనంతరం ఇది కావాలి.. అది కావాలి అంటూ అతడి నుంచి దాదాపు రూ.కోటికి పైగా గుంజేసింది. ఇక ఇదంతా గ్రహించి మోసపోయానని భావించిన ఆ యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తెలిసి ఆ యువతి చేసిన పనికి అంతా షాక్ అయి ఆశ్చర్యపోతున్నారు. కావాలనే ఆ యువతి అలా చేసిందని అంటున్నారు. మరి ఆ యువతి ఏం చేసింది. అతడి నుంచి ఎలా డబ్బు కొట్టేసింది? అనే విషయానికొస్తే.. Also Read: ఫుడ్ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి? ఫేస్‌బుక్‌లో ప్రేమ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాలకు చెందిన లావణ్య అనే యువతి పక్కా ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే ఫేస్ బుక్‌లో తన చెల్లెలు ప్రియాంక పేరు, ఫొటోతో కొత్త అకౌంట్ క్రియేట్ చేసింది. అందులోనే హైదరాబాద్‌కు చెందిన సాయిలు అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అలా చాటింగ్ వరకు వెళ్లింది. ఆపై నెంబర్లు కూడా షేర్ చేసుకున్నారు. ఇక తరచూ ఫోన్లో మాట్లాడుకున్నారు. అలా ప్రియాంక మాట్లాడుతున్నట్లు ఆమె అక్క లావణ్య సాయిలుతో మాట్లాడింది. ఈ క్రమంలోనే తనకు అది కావాలి, ఇది కావాలి అంటూ తరచూ ఏదో ఒక కారణంతో డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేసింది. ఏకంగా రూ.1.20 కోట్లు వసూలు చేసింది. ఇదంతా గమనించి మోసపోయానని భావించిన ఆ యువకుడు వెంటనే పత్తికొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో దాదాపు రెండు రోజులుగా అక్కడ పంచాయితీ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లావణ్య అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అలా చేస్తే ఈ కేసు సర్దుమనుగుతుందని భావించింది. బాధితుడు సాయిలును బెదిరించేందుకు లావణ్య ఇలా చేసిందని స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. #crime-news #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి