రోజాకు బిగ్ షాక్.. అట్రాసిటి కేసులో అరెస్ట్!?
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్‌లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. సూర్యలంక బీచ్‌లో ఉద్యోగితో చెప్పులు మోయించిన ఇష్యూలో దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలులోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.
AP: మందుబాబులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 3 బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించింది. త్వరలోనే మరో 2 కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ₹99కే ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలోని పల్నాడులో దారుణం జరిగింది. అప్పుల బాధతో తండ్రి తన ఇద్దరి కూతుళ్లను తీసుకుని కాల్వలోకి దూకాడు. దీంతో చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకుని బతిమిలాడినా అతడి మనసు కరగలేదు. నీటిలోనే పెద్ద కూతురిని విడిచిపెట్టి ఒడ్డుకొచ్చేశాడు.
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కాస్త ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కు వాయిదా వేసింది.
AP: తనను రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు స్పందించారు. పవన్ ఢిల్లీకి వెళ్ళింది సొంత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
AP: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్‌ను కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
గుండెపోటును నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కాలేజీ విద్యార్థులు కనుగొన్నారు.ప్రొఫెసర్ సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీ ప్రసన్న అభివృద్ది చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది.
ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.