ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి ఏపీలోని పల్నాడులో దారుణం జరిగింది. అప్పుల బాధతో తండ్రి తన ఇద్దరి కూతుళ్లను తీసుకుని కాల్వలోకి దూకాడు. దీంతో చిన్న కూతురు చనిపోయింది. పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకుని బతిమిలాడినా అతడి మనసు కరగలేదు. నీటిలోనే పెద్ద కూతురిని విడిచిపెట్టి ఒడ్డుకొచ్చేశాడు. By Seetha Ram 29 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ప్లీజ్ నాన్న.. మమ్మల్ని చంపొద్దు నాన్నా.. నీ కాళ్లు పట్టుకుంటా నాన్నా.. కాపాడు నాన్నా అని కూతురు మొరపెట్టుకున్నా కన్నతండ్రి మనసు కరగలేదే. తాను చేసిన తప్పుకు అభం సుభం తెలియని ఆ పసి పిల్లలను కడతేర్చాడు. తన ఇద్దరి కూతుళ్లతో ఆత్మహత్య చేసుకోవాలని వెళ్లి అతడు బతికిపోయి.. జాలి దయా లేకుండా కూతుళ్లను చంపేశాడు. ఈ వ్యవహారాన్నంతటినీ చూసిన ఓ వ్యాన్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ వృత్తిరీత్యా ఓ దినపత్రికలో విలేఖరిగా చేస్తున్నాడు. అయితే నాగాంజనేయ శర్మ భార్య అనారోగ్యంతో మంచం పట్టడంతో.. తన ఇద్దరు కూతుళ్లు యామిని(10), కావ్య(7) అతడే చూసుకుంటున్నాడు. Also Read: అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా? విపరీతంగా అప్పులు మరోవైపు నాగాంజనేయ శర్మ విపరీతంగా అప్పులు చేశాడు. దీంతో అప్పులిచ్చిన వారి నుండి అతడికి ఒత్తిడి ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆపై ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే తనతో పాటే తన కూతుళ్లను కూడా అనంతలోకాలకు తీసుకుపోవాలనుకున్నాడు. దీంతో మంచం పట్టిన భార్యను వదిలేసి ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యాడు. Also Read: పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. ఎమ్మెల్యేపై సీరియస్ ప్లీజ్ కాపాడు నాన్నా ఇద్దరు పిల్లలను ఆసుపత్రిలో చూపించాలంటూ బైక్ పై ఎక్కించుకొని ముప్పాళ్ల కాల్వలోకి బైక్‌ను తీసుకెళ్ళాడు. దీంతో ఊపిరాడక చిన్న కూతురు అక్కడికక్కడే చనిపోయింది. ఇక ఈత వచ్చిన నాగాంజనేయ శర్మ మునగకపోవడంతో పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకొని ‘‘నాన్న, మమ్మల్ని చంపొద్దు.. నాన్నా.. నీ కాళ్లు పట్టుకుంటా నాన్న.. నీళ్లలో మునిగిపోతున్నాం నాన్న, మమ్మల్ని బయటికి తీయి నాన్నా’’ అంటూ బ్రతిమిలాడింది. Also Read : జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్! కానీ ఏమాత్రం చలించని నాగాంజనేయ శర్మ కాలు పట్టుకున్న బిడ్డను వదిలించుకున్నాడు. దీంతో పెద్ద కూతురు కూడా మునిగి చనిపోయింది. ఇక నాగాంజనేయ శర్మకు ప్రాణం మీద తీపి పుట్టిందేమో.. పిల్లలని చంపేసి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు. ఇదంతా చూసిన పాల వాహనం డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాగాంజనేయ శర్మను అదుపులోకి తీసుకొని, కాలువలో నుండి పిల్లల మృతదేహాలు బయటకి తీశారు. #crime-news #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి