AP High Court: హైకోర్టులో సజ్జలకు ఊరట! AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కాస్త ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కు వాయిదా వేసింది. By V.J Reddy 29 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Sajjala Ramakrishna Reddy : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కాస్త ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కు వాయిదా వేసింది. కాగా తదుపరి విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి. ఇప్పటికే సజ్జలతో సహా పలువురు నేతలపై పోలీసులు ఇదే కేసుకు సంబంధించి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం! సజ్జలపై లుక్ ఔట్ నోటీసులు... ఇది కూడా చదవండి: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్! సజ్జల రామకృష్ణారెడ్డి పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో సజ్జల ప్రమేయం ఉందనే సమాచారం మేరకు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను ప్ పోలీసులు పలుమార్లు విచారణకు పిలిచి అసలు విషయాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి ఈ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్ని అధరాలు సేకరించిన పోలీసులు దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇది కూడా చదవండి: BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్! వైసీపీ నేతలే టార్గెట్... మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై కొందరు దాడి చేశారు. ఈ కేసులో కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌తో పాటు 14 మంది నిందితులుగా ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో.. అధికారం వారి చేతిలో ఉందని వాళ్లకి నచ్చినట్లుగా రెచ్చిపోయారు. కేవలం టీడీపీ కేంద్ర కార్యాలయంపై మాత్రమే దాడికి పాల్పడకుండా ఆ ప్రాంతాల్లో కూడా బీభత్సం సృష్టించారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్ కోసం వీరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కాగా ఇంకా హైకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు వెలువరించలేదు. ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ! #ycp #sajjala-ramakrishna-reddy #high-court #TDP Office Attack Case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి