Vijay paul: విజయ్‌ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్‌ను కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

New Update
ap

సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్‌ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు.. విజయ్‌పాల్‌ను రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు. రఘురామను జైల్లో టార్చర్ పెట్టిన కేసులు విజయ్‌ పాల్ కీలక వ్యక్తి అని.. జైట్టో థర్డ్ డిగ్రీ పాటంచడం వెనుక అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీని కోసం కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు కు చెప్పారు.రిమాండ్‌ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

నిన్న విజయ్ పాల్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు రాత్రి 9గంటల సమయంలో విజయ్‌ పాల్‌ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ విజయ్‌పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తరువాత సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్‌ అధికారికంగా ప్రకటించారు.

Also Read: Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అసలేం జరిగింది?

2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: RGV Reaction: దయచేసి అర్థం చేసుకోండి.. RGV మరో సంచలన వీడియో!

Also Read:  వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'

Also Read: నాకు మోదీ, అమిత్‌ షా సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు