/rtv/media/media_files/2025/03/22/HlnAxsjy5Ahy7iBLFnsF.jpg)
nandhyala
నంద్యాల జిల్లాలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఉన్న బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణహత్య చేశారని పోలీసులు తెలిపారు.
Also Read: America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి దారుణ హత్య
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2025
నారాయణపురంలో ఉన్న తన పొలానికి వెళ్లిన సుధాకర్ రెడ్డి
తిరిగి వస్తుండగా దారికాచి కత్తులతో దాడి చేసిన ప్రత్యర్ధులు
తలపై నరకడంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి
ఆధిపత్యపోరే సుధాకర్ రెడ్డి హత్యకు కారణం అంటున్న స్థానికులు
సుధాకర్… pic.twitter.com/ITACmupP0U
పొలంలో పనులకు వెళ్తున్న....
ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపిన వివరాల మేరకు… ఇవాళ ఉదయం తన పొలంలో పనులకు వెళ్తున్న నంద్యాల సుధాకర్ రెడ్డి దారుణహత్యకు గురయ్యారన్నారు. గ్రామంలో ఒక సామాజికవర్గంతో గత కొన్నేళ్లుగా ఓ వివాదం నెలకొని ఉందని తెలుస్తుందన్నారు. ఆ సమస్య నేటికీ పరిష్కారం కాలేదని పలువురు గ్రామస్తులు పేర్కొనటం విశేషం.
వైసీపీకి చెందిన వ్యక్తి దేశం సుధాకర్ రెడ్డి తలపై మారణా యుధాలతో దాడి చేశారు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతిచెందాడని పోలీసులు పేర్కొన్నారు. దేశం సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.
నంద్యాల జిల్లాలో దారుణం..
— RTV (@RTVnewsnetwork) March 22, 2025
బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన సుధాకరరెడ్డి అనే వ్యక్తి దారుణ హత్య..
పొలం వద్దకు వెళ్ళి తిరిగి వస్తుండగా వేటకొడవళ్లతో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు...
హత్యకు స్థలం విషయం కారనంగా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు...
ఘటన పై… pic.twitter.com/aWh0XjW6uw
crime | kurnool | ycp | nandhyala | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates