/rtv/media/media_files/2024/12/31/ul4MzIDnB7Yjbuzgwc9S.jpg)
APSRTC Special Buse Mahakumbh 2025
ApsRTC: ఏపీ వాసులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మొత్తం 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
12 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు...
వైఎస్‌ఆర్ జిల్లాలోని 12 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలోని 9 శివాలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లాలోని 9 శివాలయాలకు, నంద్యాల జిల్లాలో 7 దేవాలయాలకు బస్సులు నడపనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా మినహా మిగతా జిల్లాలలోని అన్ని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
మరోవైపు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి శివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని డిపోలు, ముఖ్య పట్టణాల నుంచి శ్రీశైలానికి బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సుమారుగా రూ.11 కోట్ల రాబడి వచ్చే అవకాశాలున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మహాకుంభమేళాకు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉంచారు.