/rtv/media/media_files/2024/12/17/wJzsdG0WEh17U8o3yNaP.jpg)
Weather update
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇంకా మార్చి కూడా రాకముందే ఉక్కపోతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ రెయిన్ అలర్ట్(Rain Alert) జారీ చేసింది. ఈనెల 22న తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే ఈ నెల 21 నుంచి 24 వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy rains in North Coastal districts) పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
Also Read: chaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
అయితే గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖా తెలిపింది. దీంతో గాలిలో అనిశ్చితి కారణంగా వచ్చే రెండు, మూడు రోజుల్లోతెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అలెర్ట్ జారీ చేశారు. వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కోస్తాలో ఈరోజు పొడి వాతావరణం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత రేపు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖా అంచనా.
Also Read: Lavanya: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..
Also Read: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా స్కామ్‌లో లోకాయుక్తా క్లీన్ చీట్