/rtv/media/media_files/2025/03/24/PqdFYZxpM9NsXhhZXUgR.jpg)
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనీ డీఆర్‌ఎస్‌కు వెళ్తే 99 శాతం నిర్ణయం అనుకూలంగా వస్తుంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ శాంట్నర్ వికెట్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయమని కెప్టెన్ రుతురాజ్‌కు సూచించాడు ధోనీ. రివ్యూలో ఫలితం చెన్నై సూపర్ కింగ్స్ కు అనుకూలంగా రావడంతో శాంట్నర్ వెనుదిరిగాడు . ఇది చూసిన కామెంటేటర్ ఆకాశ్ చోప్రా, డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను ధోని రివ్యూ సిస్టమ్ అని పిలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ట్రంప్ మాజీ కోడలితో ప్రేమలో పడ్డ గోల్ఫ్ సూపర్‌స్టార్
ఇక తనకంటే మంచి వికెట్ కీపర్ ఇప్పటికీ లేడని మరోసారి నిరూపించాడు ధోనీ. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి సూర్య కుమార్ యాదవ్ ను 0.12సెకన్లలో స్టంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ, అభిమానులు కూడా షాక్ అయ్యారు.
Also Read : CSK Vs MI మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్.. చెన్నై బౌలర్ వీడియో వైరల్!
Also Read : వివేక్, బాల్క సుమన్ సీక్రెట్ మీటింగ్.. అసలేం జరుగుతోంది?
మ్యాచ్‌లో ఏం జరిగింది?
చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టీమ్ తడబడింది. 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ 31, సూర్యకుమార్ యాదవ్ 29, దీపక్ చాహర్ 28 పరుగులు చేశారు. చెన్నై తరఫున నూర్ అహ్మద్ 4 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు.టార్గెట్ కోసం బరిలోకి దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. రచిన్ రవీంద్ర అజేయంగా 65 పరుగులు చేయగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులు చేశాడు. చెన్నై తదుపరి మ్యాచ్‌లో మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది, ముంబై ఇండియన్స్ మార్చి 29న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
Also Read : Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు!
mumbai-indians | chennai-super-kings | telugu-cricket-news | telugu-sports-news | latest-telugu-news | today-news-in-telugu