/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Stock-Market-Investers-jpg.webp)
Stock Market
ఈరోజు ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్ కళకళలాడింది. సెషన్స్ లాబాలతో మొదలయ్యాయి. నిన్నటి వరకు నష్టాల బాటలో పయనించిన మార్కెట్ ఈ రోజు లాభాల్లోకి రావడంతో మదుపర్లు కాస్త ఊపరి పీల్చుకున్నారు. బ్యాంక్, ఆటో, ఎనర్జీ రంగ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో రాణిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభం అయిన కొన్ని నిమిషాలకే సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడి ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ కూడా 133 పాయింట్లు పైకెగిసింది.
Also Read: HYD: హరీశ్‌రావు గృహ నిర్భంధం..భారీగా పోలీసులు
ప్రారంభం నుంచే లాభాల్లో..
నిన్న 76, 330.01దగ్గర ముగిసిన సెన్సెక్స్ ఈరోజు 7,335.75 కు పెరిగి ట్రేడింగ్ ప్రారంభించింది. అక్కడినుంచి కొన్ని నిమిషాల్లోనే ఇంకా పైకి జంప్ చేసింది. సెన్సెక్స్ సూచీలో ఎన్టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జొమాటో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, బజాజ్‌ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలున్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. దీనికి కారణం రిటల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి చేరుకోవడమే అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
Also Read: USA: మస్క్ చేతికి టిక్‌టాక్...అమ్మే ఆలోచనలో చైనా