FIA 2026: తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం.. FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి!
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
ఐటెల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ సూపర్ 26 అల్ట్రాను 6000mAh బ్యాటరీతో విడుదల చేసింది. ఈ ఫోన్లో 6.78 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని ధర ప్రారంభ ధర సుమారు రూ.15,000గా నిర్ణయించారు.
మెటా సంస్థ తాజాగా చిక్కుల్లో పడింది. ఆ కంపెనీ రూపొంచిందిన ఏఐ అసిస్టెంట్ మెటా ఏఐ చాట్‌బోట్స్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూజర్లతో సంభాషణల కోసం ప్రముఖుల పేర్లు, ఫొటోలను వాడి మెటా AI పేరడీ చాట్బోట్లను రూపొందించినట్లు తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా పోషకాహారంలోనూ, వ్యవసాయంలోనూ కీలకపాత్ర పోషిస్తున్న పప్పుధాన్యాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. భారతదేశం ఏటా 28 మిలియన్ మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతి లభించింది. టెలికాం శాఖ ఆ సంస్థకు లైసెన్సును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో ఈ లైసెన్స్ అందుకున్న మూడో సంస్థగా స్టార్‌లింక్ నిలిచింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ అయోధ్యను సందర్శించనున్నారు. హర్యానాకు చెందిన సెర్వోటెక్ సంస్థకు గ్లోబల్ అడ్వైజర్‌గా ఎరాల్ మస్క్ నియమితులయ్యారు. ఈ క్రమంలో ఐదు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు.
హైదరాబాద్‌లోని రాంనగర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో భారీ గోల్డ్ కుంభకోణం జరిగింది. సరైన పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల విలువ చేసే బంగారు రుణాలు ఇచ్చిన ఇద్దరు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ మొదటిసారిగా TIME100 దాతృత్వ జాబితా 2025లో చోటు దక్కించుకున్నారు. గతేడాది ముఖేష్, నీతా అంబానీ రూ. 407 కోట్లు విరాళంగా ఇచ్చి అగ్రశ్రేణి దాతల జాబితాలో చేరారు.
బంగారం ధర సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది.పెండ్లిళ్ల సీజన్లో బంగారం కొందామనుకున్న వారికి ధరలు నిరాశే మిగుల్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన బంగారం రేట్లలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే గతంలో గరిష్టానికి చేరిన ధర స్వల్పంగా తగ్గింది.