/rtv/media/media_files/2025/03/24/4RbyfYeBPtCvQXm0KHbv.jpg)
Gold prices
Gold and Silver Prices : బంగారం ధర సామాన్యులకు అందనంత పైకి ఎగబాకుతోంది. పెండ్లిళ్ల సీజన్‌లో బంగారం కొందామనుకున్న వారికి బంగారం ధరలు నిరాశే మిగుల్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో కొండెక్కిన బంగారం రేట్లలో నేడు ఎలాంటి మార్పు లేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది.
Tummala Nageswara Rao:తెలంగాణ రైతులకు పెద్ద షాక్.. వారికి రుణమాఫీ లేదని చెప్పిన మంత్రి తుమ్మల..!
గుడ్డిలో మెల్లలా ఇటీవల జీవిత కాల గరిష్ఠానికి(తులం రూ.90 వేలు) చేరిన బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా వరసగా చుక్కలు చూపిస్తున్న పసిడి ధర ఇవాళ స్వల్ప తేడాలతో యథావిధిగా కొనసాగుతోంది. అయితే గతంతో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ రూ. 90 వేలు దాటిన గోల్డ్ రేటు గత మూడు రోజుల్లో రూ.880 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రికార్డ్ స్థాయిలో రూ. 90,660కి పెరగగా.. తాజాగా ఆదివారం నాటికి రూ. 89,780కి తగ్గింది. వాస్తవానికి గోల్డ్ ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి మరింతగా పెరుగుతాయని భావించారు. కానీ నెమ్మదిగా బంగారం, వెండి ధరలు దిగొస్తుండటంతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభిస్తున్నది. అయితే, అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ మార్కెట్లోకి తరలిస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, డిమాండ్ సప్లై మధ్య తేడాలు కూడా ధరలు స్వల్పంగా తగ్గడానికి ఒక కారణమని అంటున్నారు.
Also Read: America: అమెరికాలో మరోసారి కాల్పులు...ముగ్గురు మృతి..15 మందికి తీవ్ర గాయాలు!
బంగారం ధర గడచిన ఏడాది కాలంగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధర ఎక్కువగా పెరిగింది. హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో 24 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములకు రూ.86,840కి, 22 క్యారెట్ల బంగారం రేట్ రూ.79,600కు చేరింది. అప్పటి నుంచి గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాలపై సుంకాలు పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెద్ద మొత్తంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడంతో బంగారం ధర భారీగా పెరగడం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లు రికవరీ బాట పట్టడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
Also Read: Punjab National Bnak Scam:బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు!
సోమవారం ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,566 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.87,890 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,713 ఉండగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.88,050 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,841 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.88,190 వద్ద కొనసాగుతోంది. అయితే మరికొన్ని రోజుల్లో బంగారం ధర రూ.లక్ష దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మార్కెట్ పండితులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఎలా ఉందంటే..కోల్‌కతా- రూ.80,603, రూ.87,930, చెన్నై- రూ.80,942, రూ.88,300, బెంగళూరు- రూ.80,777, రూ.88,120, పుణె- రూ.రూ.80,713, రూ.88,050, అహ్మదాబాద్- రూ.80,813, రూ.88,160, భువనేశ్వర్- రూ.80,731, రూ.88,070, భోపాల్- రూ.80,795, రూ.88,140, కోయంబత్తూర్- రూ.80,942, రూ.88,300, పట్నా- రూ.80,667, రూ.88,000, సూరత్- రూ.80,813, రూ.88,160,
Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?
ఇక వెండి ధరల్లోనూ స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర ఆదివారం రూ.97,730 ఉండగా.. నేడు రూ.97,740కు చేరింది. ముంబైలో నిన్న కేజీ వెండి రూ.97,900 కాగా.. నేడు రూ.97,910 వద్ద కొనసాగుతోంది. అలాగే తెలుగు నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర ఆదివారం రూ.98,050 ఉండగా.. నేడు రూ.98,060కి చేరుకుంది.
Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్
Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?