హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అత్తాపూర్ లో పెను విషాదం చోటు చేసుకుంది.నగరంలో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఇంట్లో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారంతో అత్తాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం పింకీ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also Read: Ugadi panchangam: ఉగాది పంచాంగం.. కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ఇక తిరుగే లేదు
పింకీ సంవత్సరం క్రితమే అమిష్ లోయా అనే వ్యక్తిని కోర్టు మ్యారేజ్ చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.పింకీ ఆత్మహత్య కు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏమైనా కారణమా అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Mynmar Earth Quake: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి
వర్క్ ప్రెజెర్ తట్టుకోలేక...
ఇదిలా ఉంటే హైదరాబాద్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. వర్క్ ప్రెజెర్ తట్టుకోలేక ఓ ఐటీ ఉద్యోగిని దుర్గం చెరువులో దూకింది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఎస్ఆర్ నగర్ కు చెందిన జి.రోజా ఐటీ కారిడార్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆఫీస్నుంచి నేరుగా కేబుల్ బ్రిడ్జి మీదకు వచ్చి, దుర్గం చెరువులోకి దూకేసింది.
పోలీస్పెట్రోలింగ్ సిబ్బందితోపాటు చెరువులో బోట్లో గస్తీ నిర్వహిస్తున్న రెస్క్యూ టీం ఆమెను కాపాడారు. బోటింగ్ సూపర్వైజర్ మనోహర్, డ్రైవర్ విష్ణు రోజాను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. పోలీసులు విచారణలో.. తాను వర్క్ప్రెషర్కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యానని, అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపింది. అనంతరం ఆమెను ఓ ప్రైవేట్ఆసుపత్రికి తరలించారు.
crime | hyderabad | mehandi | artist | suicide | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates