/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
తెలంగాణ లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఏ జిల్లాలో చూసినా ఉష్ణోగ్రతలు అధిక మొత్తంలో నమోదు అవుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో దంచికొట్టాల్సిన ఎండలు.. మార్చి నెలలో మాడు పగిలేలా చేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది. తెలంగాణలో ప్రజలు ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొద్ది రోజుల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rainfall Spatial distribution forecast of Telangana for next 5 days dated 29.03.2025@TelanganaCMO @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/c8Fw5DLzZQ
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 29, 2025
Also Read: GT vs MI : దంచికొట్టిన రూ.8 కోట్ల ఆటగాడు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే!
ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకిపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల కారణంగా ప్రజలు ఇంట్లో నుంచి భయటకు రాలేకపోతున్నారు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: Watch Video: ఘోరంగా కొట్టుకున్న స్కూల్ టీచర్, అంగన్‌వాడీ వర్కర్.. వీడియో వైరల్
వర్షాలు కురిసే సమయంలో మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కాకుండా.. మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.తెలంగాణలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో.. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ తేలికపాటి వర్షాల ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట లభించింది.
Weather warnings of Telangana for the next 5 days dated 29.03.2025@TelanganaCMO @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/JWX5cZNbeA
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 29, 2025
రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు మిశ్రమ ప్రభావాన్ని చూపించాయి. వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం అధికంగా చోటు చేసుకుంది. రైతులు పంటల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఏపీలో కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అమరావతి వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ ప్రకటించింది. అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ప్రభావం దీనికి కారణం అని వాతావరణశాఖ తెలిపింది.
Rainfall Spatial distribution forecast of Telangana for next 5 days dated 29.03.2025@TelanganaCMO @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/c8Fw5DLzZQ
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 29, 2025
Also Read: Cheapest Recharge Plan: వారెవ్వా చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్- 365 రోజుల వ్యాలిడిటీ.. కానీ!
Also Read: Nubia Neo 3 5G: ఏంటి భయ్యా ఈ అరాచకం.. 12/256జీబీ కొత్త ఫోన్ ఇంత చీపా- వదలొద్దు మావా!
alert | TG Weather Updates | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates