Vigyan Vaibhav - 2025: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత్‌ను లీడర్‌గా నిలిపేందుకే "విజ్ఞాన్‌ వైభవ్‌'

జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యూత్‌ ఎక్స్‌లెన్స్‌ల ఆధ్వర్యంలో ‘విజ్ఞాన్‌ వైభవ్‌ 2కె25’ పేరిట రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

New Update
 Defence exhibition at Gachibowli

Defence exhibition at Gachibowli

ఈ ప్రదర్శనను శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మూడు రోజులపాటు కొనసాగే ప్రదర్శనలో దాదాపు 200 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పాఠశాలలు, ఇంజినీరింగ్‌ విద్యార్థులతో పాటు దాదాపు 30 వేల మంది ఈ ప్రదర్శన చూసేందుకు ఇప్పటికే పేరు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు ముందుగా పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. యుద్ధ పరికరాల పనితీరు, వాటి తయారీ పరిజ్ఞానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. మార్చి 1, 2 తేదీల్లో సాధారణ ప్రజలు సందర్శించవచ్చు. ఏరోస్పేస్, డిఫెన్స్‌ టెక్నాలజీ పరిజ్ఞానంతో పాటు ఈ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఇది కూడా చూడండి: Kiara Advani : గుడ్‌ న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన

కాగా ఈ ప్రదర్శనలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్‌ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలున్న ఈ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సరిహద్దుల సంరక్షణకు, శత్రుదాడులను నిరోధించేందుకు భారతదేశం అభివృద్ధి చేసిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఇది. అధిక వేగం, దూరం, కచ్చితత్వం దీని ప్రత్యేకత. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణి. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే ఆకాష్‌ క్షిపణి, ప్రళయ్‌ బాలిస్టిక్‌ క్షిపణి, యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ నాగ్‌ ఇక్కడ ఉన్నాయి.
మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్‌ పినాకను ప్రదర్శనకు ఉంచారు. రాకెట్లను సెకన్లలో ప్రయోగించడం దీని విశిష్టత. ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించగల సూపర్‌సోనిక్‌ క్షిపణులు కూడా ఇక్కడ కొలువు తీరాయి.

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌కు సంబంధించిన యంత్రాలనూ ప్రదర్శనకు ఉంచారు. శత్రువులకు సంబంధించిన విమానాలు, డ్రోన్‌లు, మిస్సైల్స్‌ గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలను చెప్పే అత్యాధునిక వ్యవస్థ ఇది.వివిధ రకాల యుద్ధట్యాంకులు ఇక్కడ ఉంచారు. శాస్త్రవేత్తలు వాటి ప్రత్యేకతలను సందర్శకులకు వివరిస్తున్నారు.సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో భారత్‌ లీడర్‌ కావాలనేదే మా లక్ష్యం. ఆ దిశగా యువతను ముందుకు నడిపించేందుకు పరిశోధనలను, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. యువతరంలో స్ఫూర్తి నింపి వారిని సైన్స్‌ వైపు ఆకర్షించే ఉద్దేశంతో హైదరాబాద్‌ నగరంలో తొలిసారి విజ్ఞాన్‌ వైభవ్‌ను నిర్వహిస్తున్నామని నిర్వహకులు తెలిపారు.  

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

Advertisment
Advertisment
Advertisment