Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణపై చర్చించడానికి రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం. మంత్రివర్గంలో ముగ్గురి పని తీరుపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధిష్టానం, రాష్ట్ర ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ ముగ్గురు మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి వర్గ విస్తరణకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ ముగ్గురి పని తీరుపై పార్టీ క్యాడర్, లీడర్, కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని అధిష్టానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయట.
Read Also : కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా
ముగ్గురు మంత్రుల పదవి ఊస్ట్..!
తెలంగాణ ముఖ్యమంత్రి జనవరి 15, 16 రెండు రోజులు ఢిల్లీ పర్యటనలోనే ఉండనున్నారు. దీంతో కొత్త మంత్రుల పేర్లు కూడా దాదాపు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ లోక్ సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఛీప్ మల్లిఖార్జున ఖర్గేలతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారు. దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ(Konda Sureka), పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావుల మంత్రి పదవులు పోతాయంటూ ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో వ్యక్తిని కూడా మంత్రి పదవి నుంచి పీకేయ్యాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. ఈ ముగ్గురిని పక్కన పెట్టి పూర్తి కేబినెట్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చలు నడుస్తున్నాయి.
Read Also : కేటీఆర్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
Also Read: కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా