/rtv/media/media_files/2025/02/17/SlW9T4JV43zo5QzlAhug.jpg)
TGSRTC Buses
తెలంగాణలోని మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా శుభవార్తలు చెబుతుంది. మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అయిన ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా.. మహిళలకు సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఈ పథకం వర్తిస్తుందని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
Also Read: America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇటీవల టీజీఆర్టీసీ కొత్తగా మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సంవత్సరం ఆగస్టు వరకు మరో 500 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్!
ప్రస్తుతం మొత్తం 22 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలు తిరుగుతున్నా వాటిలో ప్రయాణం ఉచితమో కాదో అని చాలా మంది మహిళలు వాటిలో ఎక్కడం లేదు. సాధారణ బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులు చాలా సౌకర్యంగా ఉండటంతో వాటిలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం వర్తించదేమో అని భావిస్తున్నారు.
ఈ విషయంపై టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు స్పందించారు. మెట్రో ఎలక్ట్రిక్ బస్సులపై మహాలక్ష్మి ఫ్రీ పథకం వర్తిస్తుందని స్టిక్కర్లు అంటిస్తున్నారు. మోడ్రన్ లుక్, కంఫర్టబుల్ సీటింగ్ తో నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిందని అధికారులు తెలిపారు. కాబట్టి మహిళలు ఎలాంటి సందేహం లేకుండా ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!
Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!
telangana | rtc | tgrtc | free-bus | women | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Maoist: మవోయిస్టులకు ఆర్ఎస్ ప్రవీణ్ మద్దతు.. దేశ పౌరులను చంపడం అత్యంత నేరం అంటూ!
చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన లేఖపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చలు జరపాలని కోరారు. 2004లో లాగా కాకుండా ఈ చర్చలు ఒక ప్రణాళిక బద్ధంగా ఉండాలని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
rsp maoist Photograph: (rsp maoist)
Maoist: కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్లు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు ఒప్పుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చర్చలు జరపాలన్నారు. భారతదేశ పౌరులు దేశంలో ఉన్న పౌరులను చంపడం అత్యంత నేరమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో స్పష్టంగా ఉంది. కావున ఈసారి జరగబోయే చర్చలు 2004లో లాగా కాకుండా ఒక ప్రణాళిక బద్ధంగా ఉంటే బాగుంటుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధం..
అలాగే సిర్పూర్ పేపర్ మిల్లు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. స్థానికులకే సిర్పూర్ పేపర్ మిల్లులో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పూర్ లో ఉన్న సమస్యల కోసం ఆగిపోయిన అభివృద్ధి కోసం ధర్నాలు రాస్తారోకోలు మేమే చేస్తున్నాం. రాష్ట్రంలో HCU భూములను దారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది. దీన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలిసి భూముల అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ మందు పెట్టుకుని కూర్చున్నారు. వాళ్ళ పని భూములమ్ముకోవడమే. 27 న వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని కోరారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
rs-praveen | amithsha | today telugu news
సింగపూర్ చేరుకున్న పవన్, చిరు దంపతులు.. | Chiranjeevi And Surekha To Singapore | RTV
అమరావతిలో నారావారి నూతన గృహ శంకుస్థాపన.. | CM Chandrababu New House In Amaravati | RTV
నా బిడ్డను బాధ పెట్టొద్దని 5 లక్షలు ఇస్తే... ! | Marchiyaral Newly Married Couple Sad Story | RTV
Kajal: యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని కాజల్.. నెట్టింట హాట్ ఫొటో షూట్ వైరల్
కొడుకుని తలుచుకుని పవన్ కన్నీరు | Pawan Kalyan Emotional Over Son Mark | RTV