Mini Medaram Jatara : మినీ మేడారం జాతరకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్... వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా?

తెలంగాణలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర.  ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా తరహాలో మేడారం జాతరకూ కోట్లాది మంది భక్తులు వస్తుంటారు.

New Update
Mini Medaram Jatara

Mini Medaram Jatara

తెలంగాణ (Telangana) లోనే కాకుండా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం జాతర.  ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుంభమేళా (Kumbh Mela) తరహాలో మేడారం జాతరకూ కోట్లాది సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. అయితే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మధ్యలో గత కొన్ని సంవత్సరాలుగా మినీ జాతరను నిర్వహిస్తున్నారు. 

Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఫిబ్రవరి 12 నుంచి జరగనుంది. ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. కాగా సుమారు 2 నుంచి మూడు కోట్ల మంది జాతరకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.  ఈ క్రమంలో 9 నుంచి 16 వరకు మిని మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. భక్తుల కోసం హన్మకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 9న 15 బస్సులు, 10న 10 బస్సులు, 11న 10 బస్సులు, 12న 20 బస్సులు, 13న 25 బస్సులు, 14న 50 బస్సులు, 15న 20 బస్సులు, 16న 50 బస్సులు మొత్తం 200 బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మొత్తం 400 ట్రిప్పులు నడపనున్నట్లు  ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Swati Maliwal : కేజ్రీవాల్ ఓటమి .. ఎంపీ స్వాతి మలివాల్ సంచలన పోస్ట్!

Mahalakshmi Scheme - Mini Medaram Jathara

ప్రతిరోజు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా హన్మకొండ బస్ స్టేషన్ నుంచి మేడారంకు బస్సులు నడుపుతామని తెలిపారు. ఉదయం 6:00 లకే ప్రారంభం కానున్న బస్సులను భక్తుల రద్దీకి అనుగుణంగా నడుపుతామని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీసులు మేడారం కు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు. మినీ మేడారం జాతరకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహిళలు తమ ఆధార్‌ కార్డు చూపించి ఆయా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టి 24 గంటలు బస్సులు నడపనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులపాటు సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులు కూడా మినీ జాతరకు కేటాయిస్తున్నామని, అయితే వీటికి ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆధికారులు తెలిపారు. కాగా నాలుగు రోజులపాటు జరిగే జాతర కోసం గిరిజన పూజారులు మండెమెలిగే కార్యక్రమాన్ని ముందుగానే నిర్వహించారు. ఆయా ఆలయాలను శుభ్రం చేశారు.

Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!

Also Read :  అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు..అబిడ్స్ సీఐపై భార్య ఫిర్యాదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: ఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడు

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
hyd crime

hyd crime

TG Crime: ఆస్తుల తగాదాలు ఈ మధ్య కాలంలో ఎక్కువై పోతున్నాయి. ఇటీవల కాలంలో  కన్నతల్లిదండ్రులతోపాటు తోబుట్టువులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇస్తే ఆస్తి అయినా ఇవ్వు..? లేదా ప్రాణాలైనా ఇవ్వు అన్నట్టు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. 

ఆస్తి కోసం..

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేటలో కుటుంబ తగాదాలతో అక్కను తమ్ముడు చంపాడు. పాత మలక్‌పేటలో నివాసం ఉంటున్న లక్ష్మిని ఆమె సోదరుడు మదన్‌బాబు కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న లక్ష్మిని చూసి చుట్టు పక్కన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై స్థానికులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే లక్షిని చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు


( ts-crime | ts-crime-news | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు