/rtv/media/media_files/2025/03/25/xPGfNRFToaFTP5MMWU5a.jpg)
Telangana 'Vehicle Location Tracking Device' in public transport vehicles
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాత్రి వేళ క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలు.. ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా రాత్రిళ్లు కూడా ప్రయాణించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’లను తప్పనిసరి చేసింది. మహిళలు క్యాబ్ లేదా ప్రైవేట్ బస్సు ఎక్కినప్పుడు ఇబ్బందులు ఎదురైతే.. అందులో ఉండే ఒక్క బటన్ నొక్కితే చాలు.. క్షణాల్లో పోలీసులు ప్రత్యక్షమవుతారు.
Also Read : సెలబ్రిటీలకు 72 గంటలే టైం.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్!
నిర్భయ చట్టం ప్రకారం..
ఈ మేరకు నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలకు సురక్షితమైన ప్రయాణం కలుగుతుందని భావిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే వెహికల్ ట్రాకింగ్ విధానం అమలవుతోంది. ఈ క్రమంలోనే త్వరలో ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించారు కానీ అది అమల్లోకి రాలేదు. దీంతో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : ఒకే సినిమాలో పూజా, మృణాల్.. ఫ్యాన్స్ కి పండగే!
కంట్రోల్ రూమ్‌కు అలర్ట్..
ఈ క్రమంలోనే ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్యానిక్ బటన్ నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వెళ్తుంది. దీంతో వెంటనే పోలీసులు.. లొకేషన్ ఆధారంగా వాహనం వద్దకు చేరుకుంటారు. ప్రైవేటు వాహనాలన్నింటిలోనూ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లతో పాటు అత్యవసర సమయంలో సమాచారం ఇచ్చేందుకు ప్యానిక్ బటన్ ఉంటుంది. ఈ వాహనాలను పర్యవేక్షించేందుకు రవాణా కమిషనర్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి వాహనం కదలికలు తెలుసుకొనేందుకు వీలుగా అన్ని రకాల ప్రజారవాణా వాహనాలను పోలీస్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేస్తారు.
Also Read: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
మహిళలకు ప్రయాణంలో వేధింపులు ఎదురైతే ప్యానిక్ బటన్ నొక్కగానే.. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్తుంది. వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులను అలర్ట్ చేస్తారు. వెంటనే లోకల్ పోలీసులు వాహనం వద్దకు చేరుకొని బాధితులను రక్షించే చర్యలు చేపడతారు. రవాణ శాఖ తీసుకోస్తున్న ఈ వ్యవస్థతో డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాడా? లేదా? అనే విషయం కూడా తెలిసిపోతుంది. దీంతోపాటు ఎవరైనా ట్రాకింగ్ డివైజ్‌ను ఏర్పాటు చేసుకుపోతే.. ఆ వాహనాలను సీజ్ చేస్తారు. జరిమానా విధిస్తారు. మొత్తంగా మహిళల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కార్ చర్యలు చేపడుతోంది.
Also Read: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
road transport department | telangana | cm-revanth-reddy | today telugu news | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu
Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari : బీఆర్ఎస్ ను నాశనం చేసిందే అతను....కడియం శ్రీహరి సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వెంట ఉండి బీఆర్ఎస్ ను భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అహంకారం, బలుపు తగ్గించుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari
Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్పూరు మండలం చిన్న పెండ్యాల మీడియా సమావేశంలో రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కేసీఆర్ వెంట ఉండి బిఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని, కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అవినీతి అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు. నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎలా గెలిచావో అందరికీ తెలుసు. కేసీఆర్ వెంట తిరిగి ఆస్తులు కూడ బెట్టుకున్నావ్. అలాంటి ఆలోచన నాకు లేదు. ఉమ్మడి వరంగల్ కు, స్టేషన్ ఘనపూర్ కు నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం’ అని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. పల్లా రాజేశ్వర్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కడియం పేర్కొన్నారు. పల్లా మాటల్లో పూర్తిగా అహంకారం కనిపిస్తోంది తప్ప ఏ మాత్రం నిజం లేదని మండిపడ్డారు.
Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
పల్లా మాటలు విని కేసీఆర్ పరిపాలన పక్కదారి పట్టిందని, అందుకే తెలంగాణ ప్రజలు కర్రుకాల్చివాత పెట్టారని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్న పల్లాకు నా గురించి మాట్లాడే హక్కు లేదని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ది ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. అధికారం పోయినా ఇంకా అహంకారపు మాటలు తగ్గలేదని పేర్కొన్నారు.
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
కాగా ఇటీవల మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిగ్గు, శరం ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూతురి సీటు కోసం బీఆర్ఎస్‌లోని దళిత నేతలను, ఉద్యమకారులను కడియం శ్రీహరి బయటకు పంపారని మండిపడ్డారు. ఆరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్ కడియం వల్లే పార్టీ్కి రాజీనామా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. నీ దోపిడీ అంతా రాష్ట్ర ప్రజలకు తెలుసని.. నీలాంటి ద్రోహిని ప్రజలు క్షమించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా నాన్న ఒక బ్రాండ్ అని కడియం శ్రీహరి కూతురు కావ్య అంటుంది.. నమ్మినవారికి వెన్నుపోటు పోడవడంలోనా కావ్య మీ నాన్న బ్రాండ్ అని ఎద్దేవా చేశారు.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Ketireddy: గెస్ట్‌హైస్ వివాదం.. హైకోర్టులో కేతిరెడ్డికి ఊరట
BIG BREAKING: ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 22 మంది
IPL 2025: పంత్ పీకిందేమీ లేదు.. గొయెంకా వెంటనే ఆ పని చేయండి: హర్భజన్ కీలక సూచన!
Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?
BIG BREAKING : గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!