/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/SRIDHAR-BABU-jpg.webp)
Telangana Teacher MLC elections Sridhar Babu Key announcement
Sridhar Babu: బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు అడిగారు. బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేస్తుందని, మరీ పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు.
ముస్లింలను బీసీల్లో మేము కలపలేదు..
ఈ మేరకు ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను బీసీల్లో తమ ప్రభుత్వం కలపలేదని విమర్శలు చేశారు. 'కొన్ని ముస్లిం కులాలు ముందు నుంచే బీసీల్లో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పరిష్కార మార్గాన్ని సూచించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం' అని చెప్పారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం మీద బురదజల్లకుండా విలువైన సూచనలు చేయాలని సూచించారు.
తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రికార్డు స్థాయిలో 85 నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 60 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ, నల్లగొండ - ఖమ్మం - వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకీ ఇప్పటి వరకు మొత్తం 85 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పీఆర్‌టీయూ బలపర్చిన అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డితోపాటు బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Bird flu: ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. 95 గ్రామాల్లో పిట్టల్లా రాలిపోతున్న నాటు కోళ్లు!