Telangana: ఉగాది వేళ విద్యార్ధులకు రేవంత్ సర్కార్ శుభవార్త!

రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి నుంచి బాలురకు ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఆరోతరగతి నుంచి 12 వ తరగతి బాలురకు ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు.

New Update
uniform

uniform

Telangana: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరోతరగతి, ఏడో తరగతి బాలురకు ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు నిక్కర్లను అధికారులు అందించారు. ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి నుంచి బాలురకు ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

Also Read: Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!

ప్యాంట్లు కుట్టి అందించాలని...

ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఙప్తి మేరకు సమగ్ర శిక్షా ఉన్నతాధికారులు ఏకరూప దుస్తుల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఆరోతరగతి నుంచి 12 వ తరగతి బాలురకు ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు.

Also Read: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలకు వచ్చే విద్యార్థులు లాగులతో తరగతులకు హాజరయ్యేందుకు ఇష్టపడటం లేదు. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్యాంట్లు అందించాలని సర్కారు నిర్ణయంచింది. బాలికల ఏకరూప దుస్తుల విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

ఏటా ఆరు,ఏడో తరగతి విద్యార్థులకు అందించే రెండు లాగుల వస్త్రంతో చాలా మంది ఒక ప్యాంటు కుట్టించుకుని వేసుకునే వారు. ఇలాంటి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెండు జతల చొక్కాలు,ప్యాంట్లు అందించాలని నిర్ణయించింది.

Also Read:Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

Also Read:Telangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు!

school | students | dress | dress-code | children-dress | 10th students | latest-news | latest-telugu-news | latest telugu news updates | revanth-reddy

 

 

Advertisment
Advertisment
Advertisment