/rtv/media/media_files/2025/02/24/q2LOFEL9TIDEXApq2e43.jpg)
Telangana government schools AI education implemented in from today
AI Education Telangana Schools: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నేటినుంచి AI విద్య అమలు కానుంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా 6 జిల్లాల్లో 36 ప్రైమరీ స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ అమలు చేయనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు ఎఫ్ఎల్ఎన్ ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్ ముందు చదివితే ఇది లోపాలను గుర్తించనుంది.
ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె
జూమ్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్..
ఈ మేరకు రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన మెదక్, భద్రాద్రి, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి జిల్లాల్లోని 36 ప్రైమరీ పాఠశాలల టీచర్లకు AI సాంకేతికతకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. హెడ్ మాస్టర్లు, టీచర్లు, సీఆర్టీలు, ఏఎంఓలు, డీఈఓలకు జూమ్ మీటింగ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు. టీచింగ్, లెర్నింగ్, మెటిరియల్ టెక్ట్స్ బుక్, వర్క్ బుక్, హ్యాండ్ బుక్స్ ను టీచర్లకు అందించారు. కంప్యూటర్ ల్యాబ్‌లు, ఏఐ లెర్నింగ్ టూల్స్, ఏఎల్ఎల్, ఏఎంఎల్ ఇన్ స్టాల్ చేశారు. ఇక స్టూడెంట్స్ ఎఫ్ఎల్ఎన్ ద్వారా తాము నేర్చుకున్న అంశాలను కంప్యూటర్ ముందు చదివితే అది లోపాలను గుర్తిస్తుంది. దీంతో విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి టీచర్లు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఎంపికైన పైలట్ స్కూల్స్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హన్ మాన్ బస్తీ, కేటీపీఎస్ కాలనీ, వికలాంగుల కాలనీ, తాతగుడిసెంటర్, పాలకొయ్య తండా, ఓల్డ్ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్, ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్ సీ ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. మెదక్ జిల్లాలో తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, నిజాంపేట, మాసాయిపేట మండల పరిషత్ పాఠశాలలు ఎంపికయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జనతానగర్, కొంపల్లి, ప్రగతి నగర్, మల్లాపూర్, ఎల్లమ్మ బండ, బహదూర్ పల్లి ఉన్నాయి. వికారాబాద్ లో ఓల్డ్ తాండూరు (తెలుగు మీడియం), దౌల్తాబాద్, కొట్ బాస్ పల్లి, రేగడ్ మెల్వేరు, మల్కాపూర్ గని, తాండూర్ (ఉర్దూ మీడియం). ఇక నారాయణపేట్ జిల్లాలో గూడె బెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కర్ని, శివాజీ నగర్ స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అమలు కానుంది.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత