/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఆయన చేశారు. అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. దిలీప్ కుమార్ ను తెలంగాణతో పాటు మహారాష్ట్ర ఇన్ఛార్జిగా నియమిస్తూ జయంత్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : ఏంటి భయ్యా ఈ అరాచకం.. అఘోరీతో సె*క్స్.. ఆపుకోలేక మొత్తం చెప్పేసిన వర్షిణీ!
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ MLC కపిలవాయి దిలీప్ కుమార్
— Jella Sudhakar BJP (@jellasudhakar) April 12, 2025
రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ MLC కపిలవాయి దిలీప్ కుమార్
రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్‌గా దిలీప్ ను నియమించిన పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి pic.twitter.com/LsbaFJV0FA
Also Read : TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!
రెండు సార్లు ఎమ్మెల్సీగా..
మాజీ హోంమంత్రి మాధవరెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన కపిలవాయి దిలీప్ కుమార్ టీఆర్ఎస్ పార్టీతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. కేసీఆర్ కు కూడా వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ఈ నేపథ్యంలో దిలీప్ కుమార్ కు రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే.. కేసీఆర్ తో విభేదాల కారణంగా 2009లో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు.
Also Read : గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా యూటీఎఫ్, టీవీఎస్ తదితర సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అనంతరం బీజేపీలో చేరారు. గత ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. కొన్ని రోజులుగా కాంగ్రెస పార్టీ ప్రభుత్వంపై పలు ఇంటర్వ్యూల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Also Read : అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో
(latest-telugu-news | telugu breaking news | telugu-news | congress | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana news today | telangana politics news | telangana politics today)