Telangana Assembly: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం

కలగణనకు అమోదం తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.

author-image
By K Mohan
New Update
Telangana Cabinet

Telangana Cabinet

Telangana Assembly: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన(BC Caste Census)పై ఫోకస్ చేసింది. ఇప్పటికే కులగణన పూర్తి అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌(Caste Census Survey Report)ను అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. బీసీ రిజ్వేషన్ల(BC Reservation) పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్టును రెడీ చేశారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది. తర్వాత అసెంబ్లీ(Assembly) సాక్షిగా కలగణనకు అమోదముద్ర తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్(CM Revanth Reddy Government) కసరత్తు చేస్తోంది. కులగణన నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.

ఇది కూడా చవదండి: BRS బాగోతం తెలిసిపోయింది.. ఈ పోల్ పెట్టిందే అందుకు.. సీక్రెట్ చెప్పిన కాంగ్రెస్ నేత!

బీసీల రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర..

అలాగే ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!

ఇది కూడా చదవండి: Revanth Vs KCR: కేసీఆర్ పాలనే బాగుంది.. సొంత 'X' ఖాతా పోల్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్!

ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror attack : ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

New Update
Wear black bands

Wear black bands

పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన విధ్వంసలో 26మంది టూరిస్టులు చనిపోయిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో  నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని చెప్పారు.

అన్యాయానికి వ్యతిరేకంగా

 " కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులు మన దేశ ప్రజలను ఎలా చంపారో మీ అందరికీ తెలుసు. చాలా మంది గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఉగ్రవాద చర్యకు, అన్యాయానికి వ్యతిరేకంగా, రేపు (శుక్రవారం) మీరు నమాజ్ కోసం మసీదులకు వెళ్ళేటప్పుడు నల్లటి బ్యాండ్ ధరించి వెళ్లాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను " అని ఒవైసీ అన్నారు.   భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఒవైసీ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం.  కాగా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం తదుపరి కార్యాచరణపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా అందులో ఒవైసీ పాల్గొన్నారు. 

Also Read :  ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

Also read : Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment