/rtv/media/media_files/2025/02/26/laJMnzId1tJpZZ4ltYlq.jpg)
SLBC incident CM Revanth Reddy meet Prime Minister Modi
SLBC: SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.ఇక మోదీతో భేటీ సమయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ ఉన్నారు. టన్నెల్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: USA: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ప్రయాణికులను కాపాడిన పైలెట్
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు..
ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రో, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి వివరించారు. విభజన హామీలు, పెండింగ్ నిధుల విడుదలపై కూడా ప్రధానితో చర్చించినట్లు సమాచారం.
Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?
ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా ఇంకా ఆ 8 మంది ఆచూకీ లంభించలేదు. రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొన్న NDRF, NGRF, L&T, ఫైర్, సింగరేణి, హైడ్రా, ఇండియన్ ఆర్మీ , ఇంజనీరింగ్ విభాగం, నేవి, మార్కోస్ కమెండోలతో పాటు టన్నెల్ ఎక్స్‌పర్ట్స్, క్రిస్కూపర్, రాబిన్స్ కంపెనీ, నవయుగ, మెగా కంపెనీల టీంలు సైతం వారిపై ఆశలున్నట్లు చెప్పట్లేదు. అంతేకాదు ఈ ఆపరేషన్ చాలా డేంజర్ గా మారిందని, లోపల పేరుకుపోయిన మట్టిదిబ్బలను తొలగిస్తే మరో 50 మీటర్ల టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరింస్తున్నారు. దీంతో రెస్య్కూ ఆపరేషన్ చివరి అంకానికి చేరుకుంటుండగా ఆ 8మంది కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.
Also Read: మహా శివరాత్రి నాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే.. పుణ్యమే
15 మీటర్ల వరకు చేరుకున్న బృందాలు..
ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు చేరుకున్నట్లు సహాయక బృందాలు తెలిపాయి. అయితే బురద, మట్టి పెల్లలతో లోపల భయానక పరిస్థితులున్నట్లు చెబుతున్నాయి. ఘటనా స్థలానికి దరిదాపుల్లోకి వెళ్లినప్పటికీ ఆక్సిజన్ అందకపోవడంతో మళ్లీ వెనక్కి వచ్చేశారు. అయితే బుధవారం ఆక్సిజన్ సాయంతో ఘటనా స్థలానికి చేరుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఊట పెరుగుతున్న కారణంగా సీపేజ్, కూలుతున్న మట్టి పెల్లలతో టన్నెల్‌లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. సహాయక బృందాలు అత్యంత జాగ్రత్తతో ఆచితూచి అడుగులు వేస్తుండగా.. టన్నెల్లోంచి గంటకు 5వేల లీటర్ల ఊటనీరు ఉబికివస్తోంది. 100 HP కెపాసిటీ ఉన్న భారీ పంపును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, శిథిలాలు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నట్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న సిబ్బంది తెలిపారు.