Telangana: మందుబాబులకు గుడ్‌న్యూస్.. సమ్మర్‌లో ఫుల్లుగా బీర్లు!

తెలంగాణలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రాబోతుంది.

New Update
liquor

తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది కిక్కిచ్చే వార్తే. హాట్ సమ్మర్‌లో ప్రభుత్వం మందుబాబులకు మత్తెక్కించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.  కోడ్ ముగియగానే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.నగరంలో ప్రతి 3 కి.మీ ఒకటి, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీ ఒకటి చొప్పున ఈ ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటుందంట.

Also Read: TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా గ్లాసులోకి వస్తుంది. ప్రస్తుతం విదేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉండగా.. తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంటుందంట. అదే జరిగితే సమ్మర్‌లో మందుబాబులకు బీర్ల కొరత కష్టాలు తీరిపోనున్నాయి. అప్పటికప్పడు తయారయ్యే ఇన్‌స్టంట్ బీరుతో దాహం తీర్చుకోవచ్చు.ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది. రాష్ట్రంలో కొత్తగా70 బార్లను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 

Also Read: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మారనున్న దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే!

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,171 బార్లు ఉండగా.. వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ ల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలిసింది. ఎక్సైజ్ ఖజానా పెంచుకునేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దాంతో పాటుగా.. మైక్రోబూవరీల సంఖ్యను కూడా పెంచనున్నారు.

ఈ మేరకు నగరంలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. తెలంగాణలో కొత్తగా మద్యం బ్రాండ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో బీర్లు, లిక్కర్‌ అమ్మేందుకు కంపెనీల నుంచి TGBCL అఫ్లికేషన్లకు  ఆహ్వానం పలికింది. 40 వరకు కంపెనీలు లిక్కర్ సరఫరా చేసేందుకు ముందుకు రాగా.. అందులోనూ 20 దాకా విదేశీ లిక్కర్‌ బ్రాండ్లు ఉన్నట్లు సమాచారం. 10 వరకు బీర్ల కంపెనీలు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

Also Read: Banking New Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!

wines | liquor | government | telangana-govt | telangana govt good news | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Golden silk saree : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు పట్టు చీర..ప్రత్యేకతలివి

ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాములకు సిరిసిల్ల నేత కార్మికుడు సీతమ్మవారికి అరుదైన కానుక అందించనున్నాడు. సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్‌ భద్రాద్రి సీతమ్మకు బంగారు పట్టు చీర రూపొందించాడు. చేనేత మగ్గం మీదే ఈ చీరను నేయడం గమనార్హం.

New Update
 Golden silk saree

 Golden silk saree

 Golden silk saree : ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాములకు సిరిసిల్ల నేత కార్మికుడు సీతమ్మవారికి అరుదైన కానుక అందించనున్నాడు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ భద్రాద్రి సీతమ్మకు బంగారు పట్టు చీర రూపొందించాడు. చేనేత మగ్గం మీదే ఈ పట్టుచీరను నేయడం గమనార్హం. చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవతామూర్తులు వచ్చే విధంగా, చీర కింది బార్డర్ లో శంఖు, చక్ర నామాలు హనుమంతుడు, గరత్మాంతుడు వచ్చే విధంగా ఈ చీరను పొందుపరిచాడు.

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

 సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్  గతంలోనూ వైవిధ్యభరితంగా బంగారు, వెండి చీరలు నేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు పొందాడు. హరిప్రసాద్ ఈసారి కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి చేనేత మగ్గం పై నేసిన బంగారు పట్టుచీరను అందించనున్నారు. కల్యాణం సందర్భంగా రాముల వారికి కూడా పంచెను తన చేత్తో నేసి బహుమతిగా అందిస్తున్నానని హరిప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి... రమే రామే మనోరమే... సహస్రనామ తత్తుల్యం... రామనామ వరాననే...అనే శ్లోకం 51 ఒక్కసార్లు వచ్చే విధంగా నేయడం విశేషం. చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించి, ఎనిమిది వందల గ్రాముల బరువు గల ఏడు గజాల బంగారు చీర నేశాడు. సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ఈ చీర వేయడానికి 10 రోజుల సమయం పట్టిందని తెలిపాడు.  

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
 
చీరలో వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టు దారాన్ని ఉపయోగించి ఏడు గజాల చీరను ఎనిమిది వందల గ్రాములు ఉండేవిధంగా నేశారు. ఇలా దేవతామూర్తులకు అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని మా చేనేత కళను ప్రోత్సహించాలని హరిప్రసాద్ కోరారు. ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణానికి మా సిరిసిల్ల నేతన్నకు పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరిప్రసాద్ ప్రత్యేకంగా కోరుకున్నారు.గత మూడు సంవత్సరాలుగా సీతారాముల కల్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తున్న హరి ప్రసాద్ ను పలువురు అభినందించారు.

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

Advertisment
Advertisment
Advertisment