/rtv/media/media_files/2025/04/14/BHOkKFr464q2sD8imEu9.jpg)
rangareddy crime news
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంధువుల వివాహానికి వచ్చి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) అనే అక్కచెల్లెళ్ల పిల్లలు బంధువుల నివాసంలో వివాహ వేడుకకు వచ్చారు. ఈ క్రమంలో వారు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు దగ్గర ఆడుకున్నారు. ఆ సమయంలో వారు ఆటల్లో భాగంగా కారులోకి వెళ్లారు. ఆ సమయంలో కార్ డోర్లు లాక్ అయ్యాయి. దీంతో వారు బయటకు రాలేకపోయాయి.
Also Read : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాజీవ్ యువ వికాసం గడువు పెంపు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 14, 2025
ఇంటి ముందు పార్క్ చేసిన కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్
ఊపిరాడక ఇద్దరు చిన్నారులు తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) మృతి
నిర్జీవంగా పడి ఉన్న చిన్నారులను చూసి కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు #TelanganaNews #CarDoorLocked pic.twitter.com/I3GkuAxeXb
దీంతో ఊపిరి ఆడక ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే.. చిన్నారులు ఎంత సేపటికీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు కారులో అపస్మారకంగా కనిపించారు. దీంతో వెంటనే వారిని బయటకు తీసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
కారు డోర్ లాక్ అయి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చేవెళ్ల: కారు లాక్ కావడంతో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన...
Posted by Ashok Kumar Vemulapalli on Monday, April 14, 2025
ఇది కూడా చదవండి: జుట్టుకు హెన్నా వేసే వారికి షాకింగ్ న్యూస్!
గ్రామంలో విషాద ఛాయలు..
చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారికి కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తి సమాచారం కోసం విచారణ నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి?
Also Read : అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అందరికి బంగారు లాకెట్లు!
telangana crime news | telugu crime news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | rangareddy-district