/rtv/media/media_files/2026/03/02/rahul-gandhi-2026-03-02-06-51-10.jpg)
Rahul Gandhi
విపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నేడు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతరిగిరి హిల్స్‌లో 9 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్(congress) కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.
Also Read: తెలంగాణలో నడుస్తోంది ప్రజాపాలన కాదు..బుల్డోజర్ పాలన..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi To Visit Vikarabad
సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ వెళ్తారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేలా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలపై రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షులకు వివరించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రమే ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆ జిల్లా ఎస్పీ అవినీతికి పాల్పడుతున్నాడు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
Follow Us