/rtv/media/media_files/2025/02/23/QOEeDTPL5flq0o0MVASa.jpg)
Rahul Gandhi phone call to CM Revanth for SLBC incident
SLBC: నాగర్ కర్నూల్ SLBC ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఆరాతీశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.
బాధితుల కుటుంబాలకు అండగా..
ఈ మేరకు ఆదివారం ఉదయమే ఫోన్ చేసిన రాహుల్ గాంధీ.. SLBC సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు అన్ని అప్‌డేట్‌లు తెలుసుకున్నారు. దీంతో వార్త అందగానే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో, మంత్రి ఉత్తమ్ రెడ్డిని సంఘటన స్థలానికి తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్‌లను మోహరించడం గురించి రేవంత్ వివరించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించడంతోపాటు లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: రాజలింగమూర్తి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. ఏడుగురు అరెస్ట్!
ఇదిలా ఉంటే.. ప్రధానీ మోదీ సైతం శనివారం రేవంత్ కు ఫోన్ చేసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇందులో ఇరక్కుపోయినా 8మంది కార్మికులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలింది. పలువురు కార్మికులు బయటకు రాగా.. మరికొందరు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.
ఇది కూడా చదవండి: Bhupalpally: అయ్యో! పాపం.. పాలు పట్టించిన గంటల్లోనే ఇద్దరు కవలలు మృతి! ఏమైందంటే