/rtv/media/media_files/gFKJhEqSgrSCrRkB95ea.jpg)
Ponnam Prabhakar sensational allegations on MLC election results
TG News: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు.
వారిద్దరు ఎవరికి ఓటేశారు..
ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపకుండా ప్రత్యక్షంగానే బీజేపీతో చేతులు కలిపిందని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాల్లోనూ ఎన్నికలు జరిగాయి. మరీ వారిద్దరు ఎవరికి ఓటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిందని, ఈ ఓటమిపై సమీక్షించుకుని పుంజుకుంటామని తెలిపారు.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
ఇక మంత్రి శ్రీధర్ బాబు సైతం.. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీజేపీతో బీఆర్ఎస్ మమేకం అయ్యిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలానే వ్యవహరించదని ఆరోపించారు. బీఆర్ఎస్ తరఫున ఈ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టలేదన్నారు. రవీందర్ సింగ్ కు వ్యక్తిగతంగా ఓట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ సైతం ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ను బీజేపీ ఎలా లొంగదీసుకుందో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టం అయిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు. ఆ రెండు పార్టీలను వేరువేరుగా చూడడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
ఇది కూడా చూడండి: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..