PM Modi Call To Revanth Reddy: సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ!

SLBC ఘటనపై సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రమాదంపై ఆరా తీయగా పూర్తి వివరాలను మోదీకి వివరించారు రేవంత్. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. 

New Update
Modi Revanth Reddy

PM Modi Call To Revanth Reddy: SLBC ఘటనపై సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రమాదంపై ఆరా తీయగా పూర్తి వివరాలను మోదీకి వివరించారు రేవంత్. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. 

ఎనిమిది మంది కార్మికులు..

నాగర్​ కర్నూల్​ జిల్లా(Nagar Kurnool District) దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇందులో ఇరక్కుపోయినా 8మంది కార్మికులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలింది. పలువురు కార్మికులు బయటకు రాగా.. మరికొందరు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. ఘటనాస్థలాన్ని మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఇందులో భాగంగానే ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలంగాణలో మొదటి బర్డ్‌ ఫ్లూ కేసు

సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆరెఫ్ టీం ను పంపిస్తామని సీఎంకు చెప్పారు ప్రధాని మోదీ. ఇక ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఉత్తమ్‌ కుమార్.. శనివారం ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్‌ లోపలికి వెళ్లారు. 8.30 గంటలకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారు.  టన్నెల్‌లో ఓవైపు నుంచి నీరు లీకైంది. దీంతో మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చింది. టీబీఎం ఆపరేటర్‌ ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు. 42 మంది కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటికి వచ్చారు. అయితే బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. వాళ్లను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ 8 మంది ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నాం. ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటన జరిగినప్పుడు టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లని బయటకి తీసిన రెస్క్యూ నిపుణులతో మాట్లాడినట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Champions Trophy 2025: పాక్‌ గడ్డపై భారత జాతీయ గీతం.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు