/rtv/media/media_files/2025/04/14/74p3zm5I6Ddnarf6iZku.jpg)
CM Revanth Key Decision on Gig Workers
రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం స్కీ్మ్ గడువును పెంచింది. ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో SC,ST,BC, మైనార్టీల్లో ఆర్థికంగా వెనకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్
Also Read : వర్షిణి నువ్వొక ఆడదానివైతే.. అఘోరీ మొదటి భార్య సంచలన సవాల్
Gig Workers - Rajiv Yuva Vikasam
ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతీ నిరుద్యోగికి కూడా ప్రభుత్వం రుణాలు అందించనుంది. మొత్తం 4,42,438 మంది లబ్ధిదారులకు రూ.8,083.23 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు నిరుద్యోగులు ఈ స్కీమ్ దరఖాస్తు గడువును పెంచాలని డిమాండ్ చేశారు.
Also Read: మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?
ఆదివారం సీఎం రేవంత్‌ను కూడా ఎన్‌ఎస్‌యూఐ నేతలు కలిశారు. గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సీఎం నిర్ణయంతో రాజీవ్ యువ వికాసం పథకం గడువును పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా గడువు పెంపుతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ప్రభుత్వం అందజేయనుంది.
Also Read : అమ్మాయిలకు చిన్న వయసులోనే పీరియడ్స్ ఎందుకు వస్తాయి?
rtv-news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | breaking news in telugu | Rajiv Yuva Vikasam | congress-government | cm-revanth-reddy