Congress: పొంగులేటికి షాక్.. మల్లికార్జున ఖర్గే వార్నింగ్
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిజనిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఘోర విద్యుత్ ప్రమాదంతో తండ్రి, కొడుకు మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ గోపీ (25) ఆందోళనకు గురై ఉరేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కోర్టుకు హాజరై ఫైన్ కట్టాలని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో భయంతో సూసైడ్ చేసుకున్నాడు.
ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తెలంగాణలోని ఏడు మండలాలు దక్కించుకున్నాడని కవిత ధ్వజమెత్తారు. ఏపీలో కలిపిన గ్రామాల్లో ఐదింటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందన్నారు.
స్థానిక ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న ఈ అంశంపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పొంగులేటి ఇటీవల ప్రకటించారు.
ఖమ్మం జిల్లా మర్రిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి ఇల్లందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్‌తో కూడిన యాష్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆర్టీసీ కండక్టర్ సహా కనీసం పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో యువకున్ని పట్టుకుని చితకబాదారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్ వార్ విషాదాంతంకు దారి తీసింది. రెండు గ్యాంగులు పరస్పరం ఘర్షణ వల్ల సతీష్ అనే యువకుడుపై అజయ్ గ్యాంగ్ సభ్యులు కత్తులు, రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పీ క్యాంపు ఏరియాలో అర్దరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయలరాము మద్యం మత్తులో పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పై చేయి చేసుకున్నాడు.