/rtv/media/media_files/2025/02/24/DEeeJ44P9wdhVoyVo521.jpg)
konda srk Photograph: (konda srk)
Viral News: బీఆర్ఎస్ నేత కేసీఆర్‌పై మంత్రి కొండా సురేష్ భారీ సెటైరికల్ పంచ్ వేశారు. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. దీంతో విటార్ రికార్డులతో కేసీఆర్‌ను పోలీస్తూ సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. క్రికెట్‌లో విరాట్ 14 వేల రన్నులు కొట్టి రికార్డు బద్దలు కొట్టగా మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు ఈ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా చరిత్ర సృష్టించారన్నారు.
దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో #teamindia ఘన విజయం సాధించడం హర్షణీయం.
— Konda Surekha (@iamkondasurekha) February 24, 2025
6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరం టీవీలో చూసి సంబురపడినం.
14 వేల రన్నులు కొట్టి @imVkohli రికార్డు బద్దలు కొట్టగా... మన రాష్ట్ర ప్రతిపక్ష నేత #kcr గారు కూడా దాదాపు ఈ… pic.twitter.com/OoOZpn2RRm
14 నెలల 14 రోజులు..
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన మత్రి సురేఖ.. 'విరాట్ కోహ్లీ రికార్డు వర్సెస్ కేసీఆర్ విరాటపర్వం రికార్డు. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడం హర్షణీయం. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరం టీవీలో చూసి సంబురపడినం.14 వేల రన్నులు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టగా.. మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు ఈ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాలేదు.
ఇది కూడా చదవండి: SLBC UPDATES: టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఉబికివస్తున్న ఊటనీరు!
విరాట పర్వం వీడేదెప్పుడు..
ప్రజా సమస్యలపై ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా. 14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే.. 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా?' అంటూ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా పొలిటికల్ జోక్స్ పేలుతున్నాయి.
ఇది కూడా చదవండి: Chhaava Telugu Version: 'ఛావా' హిందీ ఓకే.. మరి తెలుగు సంగతేంటి..?