/rtv/media/media_files/2026/01/28/harish-rao-2026-01-28-19-08-02.jpg)
Harish Rao
Harish Rao : బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకే తాను ఢిల్లీ వెళ్లానని, పార్టీ నేతలపై ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడ సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపానని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన ఢిల్లీ పర్యటనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు(kaleswaram) కేసుతో పాటు, సుప్రీంకోర్టులో విచారణకు రానున్న 'ఓటుకు నోటు'(vote-for-note) కేసు విషయంలో న్యాయపరమైన వ్యూహాలపై చర్చించేందుకే తాను ఢిల్లీకి వెళ్లానని ఆయన వివరించారు. తన పర్యటనలో ఎటువంటి దాపరికం లేదని, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచే బహిరంగంగా వెళ్లానని ఆయన తెలిపారు.
Also Read : బీఆర్‌ఎస్‌లో కొత్త వ్యూహం.. రజతోత్సవాల ముగింపు వేళ కేసీఆర్ కీలక సమావేశం!
Harish Rao Delhi Tour
'ఓటుకు నోటు' కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు(Harish Rao Aggressive Comments) చేశారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) గత నాలుగేళ్లుగా కోర్టు నుంచి స్టే పొంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ పరంగా నామమాత్రపు లాయర్లను నియమించుకుని, నిందితుల తరఫున మాత్రం ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీని రంగంలోకి దించడం వెనుక ఉన్న మతలబు ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎంవో నుంచి లీకులు ఇచ్చి తన పర్యటనను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, విషయం లేనివారే ఇలాంటి కుట్రలకు పాల్పడతారని ఆయన ధ్వజమెత్తారు.
జగిత్యాలలో బీఆర్‌ఎస్ సభ జరిగిన రోజే కాంగ్రెస్ కూడా సభ ఏర్పాటు చేయడంపై హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు" కాంగ్రెస్ తీరు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని, కేసీఆర్ స్థాయికి, రేవంత్ రెడ్డి స్థాయికి చాలా తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. నిన్నటి జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడారని, సభలో రేవంత్ పేరును కూడా ఆయన ప్రస్తావించలేదని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చివరగా, ప్రభుత్వానికి హరీశ్‌రావు హితవు పలికారు. రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడితే కనీసం డిపాజిట్లయినా దక్కుతాయని ఆయన సూచించారు. మిగిలిన రెండున్నరేళ్ల కాలంలోనైనా ప్రజలకు మంచి పాలన అందించే ప్రయత్నం చేయాలని, రాజకీయ కక్ష సాధింపులు, ఫిరాయింపుల ప్రోత్సాహం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఫిరాయింపుల కేసులపైనా తాము న్యాయపోరాటం చేస్తున్నామని, కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణలో కొత్త స్కీమ్.. వారికి రూ.5 లక్షల బెనిఫిట్.. వివరాలివే!
Follow Us