Petrol: పెట్రోల్ కొరత(NO STOCK) కాదు.. అసలు విషయం తెలిస్తే షాక్!

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడానికి అసలు కారణం చమురు కొరత కాదు, ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానాన్ని మార్చడమే. గతంలో డీలర్లు అప్పుపై ఇంధనాన్ని పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ముందస్తు నగదు చెల్లిస్తేనే ట్యాంకర్లు పంపిస్తున్నారు.

New Update
today petrol price

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులుతీరారు. జనం అసవరం లేకున్నా డ్రమ్ములు, క్యాన్లు పెట్రోల్, డీజిల్‌(petrol-and-diesel)తో నింపి పట్టి పెట్టుకుంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు నిల్వలు ఆగిపోయాయని, పెట్రోల్ బంకులు(hyderabad-petrol-bunks) మూతపడుతున్నాయని జనాల్లో అపోహలు ఒక్కసారిగా అలుముకున్నాయి. ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు పెట్రోల్ షార్టేజ్ లేదని క్లారిటీ జనం నమ్మడం లేదు. 

హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ కంపెనీల వద్ద తగినంత స్టాక్ ఉందని భరోసా ఇచ్చింది. అయినా సరే కొన్ని పెట్రోల్ బంక్‌లు నో స్టాక్ బోర్డ్ పెట్టి కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నార్మల్‌గా బంక్‌లు నడుస్తున్నా.. జనం ఎగబడటంతో అక్కడ కూడా రద్దీ ఎక్కువై అవసరం ఉన్నదాని కంటే ఎక్కవ తీసుకెళ్తున్నారు. దీనికి కారణం పెట్రోల్ కొరత కాదు.. అసలు విషయం వేరే ఉంది.

Also Read :  హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ ఉగ్రలింకులు.. మహిళా అరెస్ట్‌

Petrol No Stock Boards

గతంలో ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు, డీలర్ల మధ్య క్రెడిట్ సిస్టమ్ ఉండేది. అంటే కంపెనీలకు డబ్బులు ఇవ్వకున్నా ఫ్యూయల్ ట్యాంకర్లు పంపించే వారు. ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ సిస్టమ్‌ను ఆయిల్ కంపెనీలు రద్దు చేశాయి. ఇప్పుడు డీలర్లు ముందుగా అడ్వాస్ చెల్లిస్తేనే కంపెనీలు డీజిల్ ట్యాకర్లను అక్కడి నుంచి పంపిస్తాయి. ఈ చిన్న మార్పు కారణంగానే చాలా పెట్రోల్ బంక్‌ల్లో నో స్టాక్ బోర్డు(No Petrol) లు కనిపిస్తున్నాయి. కోట్లల్లో వ్యాపారం కాబట్టి, అడ్వాస్ డబ్బులు ఉన్న పెట్రోల్ బంక్ ఓనర్లు బుక్ చేసుకొని ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాయి. చాలా బంక్‌ల్లో వినియోగదారులకు వాడికలు పెడుతుంటాయి. ట్రావెల్ ఏజెన్సీలకు ముందుగా పెట్రోల్ పోసి, తర్వాత వారం, నెల రోజులకు డబ్బులు వసూలు చేసుకునేవి. ఇలా బంక్‌లు నడిపే వారి దగ్గర డబ్బులు లేక ముందుగా ట్యాంకర్ బుక్ చేసుకోలేక పోతున్నారు. అది తెలియకుండా జనం, యుద్ధం కారణంగానే బంక్‌లు మూతపడుతున్నాయని అనుకుంటున్నారు. అవసరం లేకున్నా దానికంటే ఎక్కువ చమురు కొంటున్నారు. ఇలా కొరత లేకున్నా.. ఓ ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఏర్పడింది. అధికారులు, ఆయిల్ కంపెనీలు బంక్‌ల దగ్గర వాహనదారులను కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.  

Also Read :  హైదరాబాద్‌లో భారీ వర్షం... ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Advertisment
తాజా కథనాలు