TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు అక్కడక్కడ పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది.

New Update
AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!

rain alert Photograph: (rainalert)

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు అక్కడక్కడ పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పలు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 1 నుంచి 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే వీలుందని, 4 న వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది. 

Also Read: Banking New Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

వర్షాల కారణంగా 2, 3 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం అసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

ద్రోణి కారణంగా మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వర్షాలు ఆదిలాబాద్ , కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో న వర్షాలతో పాటు వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.

ఆ జిల్లాలలకు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగ్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఇదే రోజు నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చే సింది.

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!

mahabubnagar | adilabad | adilabad latest news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | telangana-weather | telangana weather news | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఉత్తమ విద్యావస్థ రూపకల్పన కోసం నూతన పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశించారు. క్షేత్రస్థాయిని దృష్టిలో పెట్టకుని దీనిని తయారు చేయాలని చెప్పారు. 

New Update
 CM Revanth Reddy

CM Revanth Reddy

విద్యా కమిషన్, విద్యాశాఖపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక విద్యస్థాయిలో ఎలాంటి సంస్కరణలు అవసరమన్నదానిపై అధికారులతో చర్చలు జరిపారు. ఇందులో భాగ్గా ఉత్తమ విద్య వ్యవస్థ కోసం కొత్త పాలసీలను తయారు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో అన్నదానిపై విద్యాశాఖ కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

ప్రజల జీవన ప్రమాణం పెరిగేలా..

తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత బాగుపడాలని...అందుకు తగ్గట్టుగా విద్యావిధానం మారాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భాషతో పాటూ, విషయ పరిజ్ఞానం పెరిగేలా పాలసీని తయారు చేయాలని చెప్పారు. దీని కోసం అవసరమయ్యే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం రెడీ గా ఉందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జయప్రకాశ్‌ నారాయణ పలు కీలక సూచనలు చేశారు. విద్యా వ్యవస్థలో 1960 నుంచి చోటు చేసుకున్న మార్పులు ఏవిధంగా నష్టం కలిగించాయో వివరించారు. బోధన ప్రమాణాలు ఏవిధంగా ఉండాలన్న దానిపై పలు సూచనలు చేశారు. 

today-latest-news-in-telugu | telangana | cm-revanth-reddy | education | review-meeting

Advertisment
Advertisment
Advertisment