/rtv/media/media_files/2025/02/14/BjBeHW3XWaE8QN4y5rXb.jpg)
Hyderabad Advocates association condemns attack on judge
TG Advocates: మహిళా జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఘటనను తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, తమకు కోర్టులో మరింత రక్షణ కావాలని న్యాయమూర్తుల సంఘం డిమాండ్ చేసింది. అంతేకాదు ఇది న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు, ఆదిలాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె.ప్రభాకర్‌రావు, సంఘం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జిల్లా అదనపు జడ్జి కె.మురళీమోహన్ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన రిలీజ్ చేశారు.
Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?
హత్య కేసులో జీవిత ఖైదు వేసినందుకు..
రంగారెడ్డి జిల్లా కోర్టు హాల్‌లో మహిళా జడ్జిపై ఖైదీ దాడిని ఖండిస్తున్నాం. కేసు విచారణ జరుగుతుండగా చెప్పు విసరడం దారుణం. ఈ ఘటనతోనైనా కోర్టుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కరణ్‌సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తి(22) 2023 జనవరి 5న ఒకరిని హత్య చేశాడు. జగద్గిరిగుట్టలో మరుసటి రోజు అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎస్‌వోటీ పోలీసులపై తల్వార్‌తో దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులపై హత్యాయత్నం కేసులో మహిళా జడ్జి కరణ్‌సింగ్‌కు జీవితఖైదు విధించారు. దీంతో జైలులో ఇబ్బందులను చెప్పుకొంటానని జడ్జిని సర్దార్ కోరాడు. ఆమె అంగీకరించడంతో తన చెప్పును జడ్జిపైకి విసిరాడు. ఆమె కుటుంబం అంతుచూస్తానని బెదిరించాడు.
ఇది కూడా చదవండి: CM Revanth: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!
ఈ ఘటనతో అందరూ ఉలిక్కిపడగా అప్రమత్తమైన పోలీసులు సర్దార్ ను గదిలోకి తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న న్యాయవాదులు కరణ్‌సింగ్‌ను పొట్టు పొట్టు కొట్టారు. కరణ్‌సింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. మహిళా జడ్జి ఫిర్యాదు మేరకు సర్దార్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!
Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు
స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై కడియం చేసిన ఆరోపణలకు తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.
Thatikonda Rajaiah vs kadiyam srihari
Thatikonda vs Kadiyam : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లడుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా..గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చరించారు. నమ్మకద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం..ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిపడ్డారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
ఇంకా ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
Also read : Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
Mark’s Health Update : పవన్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే...?
Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి
GT vs RR: 50 పరుగులు దాటిన గుజరాత్ టైటాన్స్ స్కోర్
RR VS GT: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఏపీకి గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం