/rtv/media/media_files/2025/03/21/u8MbdY73hZwXIKQzyvsK.jpg)
thunderstrom
చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. అందులోనూ ఎండాకాలం ఎండలు పెరుగుతున్న సమయంలో ఇవి కురవబోతున్నాయి. ఇవి ఒక్క రోజే పడితే, వేడి మరింత పెరిగే ప్రమాదం ఉండేది. అయితే 3 రోజులు కురిసే అవకాశం ఉండటం వల్ల.. మండే ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికింది అనుకోవచ్చు. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
రైతుల పంటలు...
హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తెలంగాణకి సంబంధించి వరుసగా 4 రోజులు వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇవి వానాకాలంలో వర్షాల లాగా కాకుండా.. అక్కడక్కడా కురుస్తాయి. అలాగే కంటిన్యూగానూ పడవు. ఇక్కడో సమస్య ఉంది. నిజానికి ఈ టైంలో వాన పడకూడదు. ఎందుకంటే ఈ సమయంలో వానలు పడితే రైతుల పంటలు దెబ్బతింటాయి. ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్!
వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశా నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదుగా దక్షిణ విదర్భ వరకూ సముద్ర మట్టం నుంచి 0.9కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలంగాణలో చల్లటి వాతావరణంతో పాటు మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్నటి వరకూ 42 డిగ్రీల వరకూ నమోదయిన ఉష్ణోగ్రతలు ఈ మూడు రోజులు 39 డిగ్రీలకు పడిపోయే అవకాశముందని తెలిపింది. పలుచోట్ల వర్షం పడటంతో అనేక మంది హ్యాపీగా ఉన్నారు.
Also Read: Phone Pay-Google Pay: ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కొత్త రూల్స్!
Also Read: Health: కొబ్బరి నీరు నిమ్మకాయ నీరు, ఏ సహజ పానీయం ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం అంటే..!
Tags : rains | telangana | weather | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates