/rtv/media/media_files/2026/02/20/crime-news-2026-02-20-17-41-54.jpg)
Government Whip Adi Srinivas's former PA wife dies suspiciously
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(aadi srinivas vemulawada) పర్సనల్ మాజీ సెక్రెటరీ వెంగళ దినేష్ గౌడ్ భార్య రోహిణి (32) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. దినేష్ మరోకరితో వివాహేతర సంబంధం(Illegal Affair) పెట్టుకొని భార్యను టార్చర్ పెట్టడం వల్లే రోహిణి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా(rajanna-sirisilla-district) కథలాపూర్ మండలానికి చెందిన రోహిణితో దినేష్ కు8 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీనిరి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. అయితే దినేష్ కొంతకాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంట్లో భార్యను వేధిస్తుండటంతో కుటుంబంలో కలహాలు మొదలైనట్లు తెలుస్తోంది.
Also Read : హైదరాబాద్లో AI వార్ రూమ్.. సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన
Government Whip Adi Srinivas's Former PA Wife Dies
కాగా, భార్యభర్తల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకోవడంతో ఇటీవలే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అతనిని పీఏ నుండి తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం రోహిణి తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. కాగా రోహిణి మెడపై బలమైన వైరుతో లాగినట్లు గాయాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రోహిణి అనుమానాస్పద మృతి పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రోహిణి మృతి కేసును అధికార పార్టీ, డబ్బు బలంతో క్లోజ్ చేయించడానికి ఆది శ్రీనివాస్ సహకారంతో దినేష్ ప్రయత్నిస్తున్నాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న దినేష్ గౌడ్ పలువురు మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్య రోహిణిని కొట్టి, చిత్రహింసలకు గురి చేశాడని వారు ఆరోపించారు. కాగా రోహిణి ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. తన పలుకుబడిని ఉపయోగించి 60 మంది పోలీసుల బెటాలియన్ను దింపి తమను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని రోహిణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోహిణి శరీరంపై చాలా చోట్ల దెబ్బలు ఉండగా, దినేష్ ,అతని కుటుంబసభ్యులు ఆమెను చంపేసి, ఉరేసి ఆత్మహత్య కోణంలో చిత్రీకరించారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆది శ్రీనివాస్ దగ్గర పీఏగా చేయడం వల్ల దినేష్ గౌడ్ తన పలుకుబడితో పోలీస్ బలగాలను సెక్యూరిటీగా ఉపయోగించి, తమను భయబ్రాంతులకు గురిచేశాడని రోహిణి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దినేష్ గౌడ్ గత ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ గెలుపు కోసం ధనసాయం చేశాడని, దీంతో రోహిణి అనుమానాస్పద మృతిని ఆత్మహత్యలా చిత్రీకరించారని ఆరోపణలు వినవస్తున్నాయి.
Also Read : రాజ్యసభ సీటుకోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ.. రేసులో డజను మంది..
Follow Us