TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది. 

New Update
meeting

TS Government Meeting

 

 

ఈ రోజు నుంచి మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రంలో పథకాల పండగ నడవనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్​ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లను రిపబ్లిక్​ డే సందర్భంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.  నారాయణ పేట జిల్లా చంద్రవంచలో వీటిని లాంచ్ చేయనున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో మధ్యాహ్నం ఒట గంటనుంచి 2.30 వరకు పంపిణీ జరుగుతుంది. మొదట 606గ్రామాల్లో ఈ పథకాలను అమలుచేయనున్నారు. ప్రతీ మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో మొదటి రోజు పథకాలను ప్రారంభిస్తారు. తరువాత అక్కడి నుంచి వరుసగా మిగతా అన్ని గ్రామాలకు వాటిని ఇస్తారు. మొదటి విడతలో 606 గ్రామాలు అవ్వగానే...రెండవ విడతలో రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి 31 వరకు అమలు చేస్తారు. 

ఎవరికీ అన్యాయం జరగనివ్వం-భట్టి

రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు పథకాలు ప్రతీ గ్రామంలో వందశాతం అమలు అయ్యేలా చూస్తామని డెప్యూటీ సీఎం భట్టి చెప్పారు.  యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా.. భూమిలేని నిరుపేదలై, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లభిస్తుంది. ఇప్పటకే గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం కూడా జరిగిందని చెప్పారు. లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కొత్తగా వచ్చిన అప్లికేషన్లను సైతం పరిగణనలోకి తీసుకుంటామని భట్టి చెప్పారు. మార్చి 31 వరకు పంపిణీ జరుగుతుందని అన్నారు. నిజమై లబ్ధి దారులకు పథకాలు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని...అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తెలిస్తే...అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని డెప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఒక్కో గ్రామంలో ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నాలుగు పథకాలకు నలుగురు అధికారులను నియమిస్తామని చెప్పారు. 

రేషన్ కార్డుల్లో ఉచిత సన్నబియ్యం-ఉత్తమ్

రేషన్ కార్డులు అందరికీ అందుతాయని..ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సామాజిక ఆర్థిక సర్వేలు, ప్రజాపాలన, ప్రజావాణి లేదా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరిగణనలోకి తీసకున్నామని తెలిపారు. ఒకవేళ జాబితా పేరు లేకపోతే వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ అయ్యాక వారందరికీ సన్నబియ్యం  ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. 

ఎకరాకు రూ. 6వేలు-తుమ్మల

రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు సీజన్​ కు రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలిపారు. ఇప్పుడు రబీ పంట కోసం ఈ మొత్తం పెట్టుబడి సాయం జమ చేస్తామన్నారు. ఈ సీజన్​లో ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద రూ.9 వేల కోట్లు ఇస్తున్నామని వివరించారు. గ్రాయాల వారీగా సాగుయోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల చెప్పారు.   

Also Read: TS: పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష-సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment